టు బి ఆర్ నాట్ టు బీ | To Be or Not To Be drama is very comedy | Sakshi
Sakshi News home page

టు బి ఆర్ నాట్ టు బీ

Nov 6 2014 10:47 PM | Updated on Sep 2 2017 3:59 PM

టు బి ఆర్ నాట్ టు బీ

టు బి ఆర్ నాట్ టు బీ

నిరుద్యోగి, పైగా గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వీటన్నింటి నేపథ్యంలో ఆత్మహత్యకు సిద్ధమవుతాడో వ్యక్తి.

నిరుద్యోగి, పైగా గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వీటన్నింటి నేపథ్యంలో ఆత్మహత్యకు సిద్ధమవుతాడో వ్యక్తి. అయితే విషం తాగి చనిపోవాలో లేక ఉరివేసుకుని చనిపోవాలో తెలియక సతమతమవడమే కాక సరైన ప్లేస్ దొరకకపోవడం, అనేక అడ్డంకులు ఎదుర్కోవడం నాటకాభిమానులకు సరదాను పంచాయి.  ఉడాన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సమర్పించిన హిందీ హాస్య నాటిక ‘టు బి ఆర్ నాట్ టు బీ’ లోని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి.
 
డాక్టర్ వసంత్ సబ్నవీస్ మరాఠీలో రచించిన మాతృకకు హిందీ భాషలోకి  అనువదించిన అమృత ఘరీపూరికర్...సందర్భోచిత చతురోక్తులతో ‘ప్లే’ను రక్తికట్టించారు. సంజిత్‌రావు, వినాయక రైఖేల్కర్, సురేష్‌కుమార్, పూనమ్ చంద న్ గోలెచా, సుహాస్ బార్వె, ఏక్తా పి రాచందాని, సిద్ధేష్, ప్రణవ అశిష్... నటించారు. సౌరభ్ ఘరీపూరికర్ దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement