సమంతకు వైరాగ్యం! | Stoicism to Samanta! | Sakshi
Sakshi News home page

సమంతకు వైరాగ్యం!

Sep 18 2014 3:56 PM | Updated on Aug 13 2018 4:19 PM

సమంత - Sakshi

సమంత

ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న సమంత మాట తీరు చూస్తుంటే ఇటీవల ఆమెకు వైరాగ్యం ఆవహించినట్లుంది.

ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న సమంత మాట తీరు చూస్తుంటే ఇటీవల ఆమెకు వైరాగ్యం ఆవహించినట్లుంది. అక్కినేని నాగచైతన్యతో 'ఏం మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్లో జెండాపాతి, ఆ తరువాత వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది.  దాంతో ఈ ముద్దుగుమ్మ  గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. ఈ బొమ్మ నటించిన మూవీ హిట్ అని  టాలీవుడ్లో  ఓ సెంటిమెంట్ ఏర్పడిపోయింది. ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాంటి టాప్ హీరోయిన్కు కూడా కష్టాలొచ్చి పడ్డాయి. జీవితం అంటే ఇదే.

ఓవర్ నైట్లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయిన సమంత ఇప్పుడు కోలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయింది. రెండు భాషల్లోనూ దుమ్మురేపుతున్న సమయంలోనే  సమంత కెరీర్ కాస్త స్లో అయింది. ఈ మధ్య వచ్చిన సినిమాలు సమంత రేంజ్కు తగ్గట్టుగా లేవని టాక్ నడుస్తోంది. దానికి ప్రధాన కారణం అంతకు ముందు కాస్త సాంప్రదాయబద్దంగా దుస్తులు వేసుకొని నటించిన ఈ చిన్నది ఈ మధ్య అందాలు ఆరబోయడం మొదలు పెట్టింది. ఎక్స్పోజింగ్ చేయాలన్నా శరీరసౌష్టవం దానికి తగినట్లుగా ఉండాలి. అదేంలేకుండా చీలికలు, పీలికల దుస్తులు, బికినీలు వేసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయం అర్ధంకానట్లుంది.

పరిస్థితి సమంతకు అర్ధమైనట్లుంది.  తన మనసులోని మాటలు ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. మార్కెట్ తగ్గిన తర్వాత కాకుండా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలోనే నటనకు స్వస్తి చెబుతానని చెప్పింది. ఎదురుదెబ్బలు తగులుతున్నాయి కాబట్టే సమంత ఇలా మాట్లాడుతోందని ఫిలింనగర్ జనాల అభిప్రాయం. అంతేకాదు, ఈ మధ్య సమంత ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అందేంటో తెలుసా?  పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలు సినీ పరిశ్రమలోకి రావద్దని చెప్పింది. ఇదంతా చూస్తుంటే సమంతకు వైరాగ్యం వచ్చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి.  ఏ హీరోయిన్కైనా ఒడిదుడుకులు సహజం. మరి సమంత ఎందుకంత ఇదై పోతుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement