
స్వాతంత్రోద్యమకాలంలోని వివిధ సందర్భాల్లో మహిళలు అనేక కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొన్న ఉదంతాలను తెలిపే చిత్రాలు
భారత జాతీయోద్యమంలో మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన మహిళలను మగవాళ్లు తమతో సమానంగా గౌరవించారు. ‘మీరు మహిళలు, బలహీనులు, ఉద్యమంలో పోరాడడానికి మీ శక్తిసామర్థ్యాలు సరిపోవు, ఆ బాధ్యత మాకొదిలేయండి’ అన్న మగవాళ్లు లేరు. మహిళాశక్తిని గుర్తించారు అప్పటి వాళ్లు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పనలో మహిళలను సమాన స్థాయిలో గౌరవించారు. సామాజికంగానూ, ఆర్థికంగానూ, రాజకీయంగానూ మహిళలకు సమాన ప్రతిపత్తిని కల్పించారు.
అవకాశాలను అందిపుచ్చుకునే దగ్గరకు వచ్చేటప్పటికి మహిళలు ఇంటిపట్టునే ఉండాలన్నది సగటు మేల్ సొసైటీ. క్రమంగా... నిర్ణయాధికారానికి అవసరమైన మేధ మహిళలకు ఉండదనే భావన మగవాళ్ల మాటల్లో వ్యక్తమవసాగింది.
మహిళలకు ఉద్యోగాలెందుకు అనే ప్రశ్న నుంచి టీచర్, డాక్టర్ వంటి ఉద్యోగాలైతే మేలన్నారు.
ఇంజనీర్లుగా ఆడవాళ్లా? అని పెదవి విరిచారు.
పత్రికలలో పని చేస్తారా? రాత్రిళ్లు కూడా పని చేయాలి తెలుసా? అన్నారు.
పోలీస్ ఉద్యోగాలు చేయాలంటే యూనిఫామ్ వేసుకోవాలిగా అన్నారు.
రక్షణ రంగంలో అడుగుపెట్టాలంటే... తుపాకీ మోస్తారా అన్నట్లు చూశారు.
చట్టసభల్లోకి వస్తారా? చట్టం చేయడమంటే పచ్చడి రుబ్బడం కాదంటున్నారు.
అటకెక్కిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడానికి ఎవరికీ నోరు పెగలడం లేదు.
ఎందుకిలా? ఎందుకిలా?
అలనాడు ఏడు దశాబ్దాల కిందట ఉద్యమాలు... యుద్ధాలలో లేని వివక్ష, అసమానత్వం...
ఇంత పురోగతి సాధించాక ఇప్పుడు ఎందుకిలా?
– మంజీర