ఆ పది చేతుల వల్లే

Woman workers are busy in the making of football nowadays - Sakshi

స్త్రీ శ్రమ

రాబోయే పుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జలంధర్‌లోని స్త్రీ కార్మికులు ఇప్పటి నుంచే ఫుట్‌బాల్స్‌ తయారీలో బిజీగా ఉంటున్నారు.

ఇవాళ గ్రౌండ్‌లో మనం కిక్‌ కొట్టిన ఫుట్‌బాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసా? తెలుసుకుంటే బాగుంటుంది. అసలు ఫుట్‌బాల్‌ అనేది యంత్ర ఆధారిత పరిశ్రమ కాదని చేతి ఆధారిత పరిశ్రమ అని తెలుసుకుంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేతులు ఎక్కువగా స్త్రీలవి కావడం.ఇవాళ భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎనభై శాతం ఫుట్‌బాళ్లు పంజాబ్‌– జలంధర్‌లోకాని, ఉత్తరప్రదేశ్‌– మీరట్‌లో కాని తయారవుతాయి. ఈ ప్రాంతాల్లో సుమారు నూట యాభైకి పైగా కుటీర పరిశ్రమలు ఫుట్‌బాల్స్‌ను తయారు చేయడమే కాకుండా స్త్రీలకు ఉపాధి కూడా కలిపిస్తున్నాయి. ఒక ఫుట్‌బాల్‌ తయారు కావడానికి పది దశల్లో పని జరుగుతుంది. అంటే పది మంది స్త్రీల చేతులు పని చేయడం వల్లే ఒక ఫుట్‌బాల్‌ తయారవుతుందన్నమాట.

ఫుట్‌బాల్‌ పరిశ్రమ ఇంతకు ముందు రోజుల్ల ఇళ్ల దగ్గర నుంచి మొదలయ్యేది. అంటే కట్‌ అయిన ఫుట్‌బాల్‌ తునకలను ఇళ్ల దగ్గర కుట్టి తర్వాత పరిశ్రమకు పంపేవారు. ఈ విధానంలో ఇళ్లల్లో ఉన్న పిల్లలు పని చేసేవారు. బాల కార్మిక వ్యవస్థ ఎటువంటి పరిస్థితిలోను ప్రోత్సాహకరం కాదు కనుక ప్రభుత్వం ఇళ్లలో జరిగే పనిని నిరుత్సాహ పరిచి చిన్నస్థాయి పరిశ్రమలను ప్రోత్సహించింది.దీని వల్ల ఇళ్లల్లో అసంఘటితంగా పని చేస్తూ ఉండిన స్త్రీలు ఇళ్ల నుంచి కదిలి కార్మికులయ్యారు. ఉద్యోగులు అయ్యారు. వీరి పని పరిస్థితులు మెరుగయ్యాయి. సంస్థలు కార్మిక సంక్షేమ నిధులను ఏర్పరచి వీరి బాగోగులు చూస్తున్నారు కూడా. ఒక స్త్రీ రోజులో నాలుగు నుంచి ఐదు ఫుట్‌బాల్స్‌ను కుట్టగలదు. లేని పక్షంలో పది నుంచి పన్నెండు రగ్బీ బాల్స్‌ కుట్టగలదు. ఈ పనికి నైపుణ్యం కావాలి. అంతేకాక ఓపిక కూడా అవసరం. స్త్రీలకు కుట్టడంలో కూర్చడంలో మెరుగ్గా పని చేసే శక్తి ఉండటం వల్ల ఈ రంగంలో రాణిస్తున్నారు. అన్నట్టు ఫుట్‌బాల్స్‌ తయారీలో మెరుగ్గా ఉన్న దేశం ఏదో తెలుసా? పాకిస్తాన్‌. విభజనకు ముందు సియోల్‌కోట్‌ ఫుట్‌బాల్స్‌ తయారీ కేంద్రంగా ఉండేది. విభజన తర్వాత నైపుణ్యం ఉన్న కార్మికులు అక్కడే ఉండిపోయారు. ఆ పరంపర అక్కడ కొనసాగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ఉంది.వరల్డ్‌ కప్‌ సమయంలో దేశానికి ఫుట్‌బాల్‌ జ్వరం పట్టుకుంటుంది.ఆ సమయంలో అందరూ ఫుట్‌బాల్స్‌ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఆ డిమాండ్‌ తట్టుకోవడానికి ఇదిగో ఈ ఫొటోల్లో చూపించినట్టు ఇప్పుడు వేగంగా పని జరుగుతోంది.
  
ఒక స్త్రీ రోజులో నాలుగు నుంచి ఐదు ఫుట్‌బాల్స్‌ను కుట్టగలదు. లేని పక్షంలో పది నుంచి పన్నెండు రగ్బీ బాల్స్‌ కుట్టగలదు. ఈ పనికి నైపుణ్యం కావాలి. అంతేకాక ఓపిక కూడా అవసరం. స్త్రీలకు కుట్టడంలో కూర్చడంలో మెరుగ్గా పని చేసే శక్తి ఉండటం వల్ల ఈ రంగంలో రాణిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top