వాట్సప్ ద్వారా సినిమాలూ ట్రాన్స్‌ఫర్! | Transfer by whats-up films | Sakshi
Sakshi News home page

వాట్సప్ ద్వారా సినిమాలూ ట్రాన్స్‌ఫర్!

Feb 18 2015 12:39 AM | Updated on Apr 6 2019 9:01 PM

వాట్సప్ ద్వారా  సినిమాలూ ట్రాన్స్‌ఫర్! - Sakshi

వాట్సప్ ద్వారా సినిమాలూ ట్రాన్స్‌ఫర్!

వాట్సప్ వినియోగదారులకో శుభవార్త. మిత్రులతో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అద్భుత సాధనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ

భలే ఆప్స్
 
వాట్సప్ వినియోగదారులకో శుభవార్త. మిత్రులతో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అద్భుత సాధనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ మెసెంజర్ సర్వీస్ ద్వారా ఇకపై భారీసైజు ఫైళ్లను కూడా సులువుగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఇప్పటివరకూ వాట్సప్‌లో 16 మెగాబైట్స్ కంటే ఎక్కువ సైజున్న ఫైళ్లను పంపే వీలు లేకపోవడం ఓ లోటుగా ఉన్న విషయం తెలిసిందే. టెక్నాలజీ సాయంతో ఈ లోటును కూడా భర్తీ చేసే వీలు ఏర్పడింది. వాట్సప్ వీడియో ఆప్టిమైజర్ పేరుతో వచ్చే మరో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అప్‌లోడ్ పరిమితిని అధిగమించవచ్చు.

ఈ అప్లికేషన్ ప్రధానంగా వీడియో కంప్రెషన్ టెక్నాలజీని వాడుతుంది. ఒకటికంటే ఎక్కువ వీడియోలను ఒకేసారి కంప్రెస్ చేయవచ్చు. ఆప్ ద్వారా నేరుగా వీడియో రికార్డింగ్ కూడా చేసే వీలుంది.ప్రస్తుతానికి వీడియో ఆప్టిమైజర్ 1.0.0.1 ఏపీకేఎక్స్ ఫైల్ ఉచితంగా అందుబాటులో ఉంది. కాకపోతే విండోస్ ఫోన్లతో మాత్రమే పనిచేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌కూ విస్తరిస్తుందని అంచనా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement