ఆ ప్రోటీన్‌తో దీర్ఘాయుష్షు?

They Have Found That Certain Types Of Morms Live Longer By Producing A Protein - Sakshi

పరిపరిశోధన

వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో సత్తువ సన్నగిల్లుతుంది. విషతుల్యమైన పదార్థాలు ఎక్కవ అవుతూంటాయి. ఫలితంగా జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు. ఈ విషయం మనకందరికీ తెలుసు. కానీ శరీరంలో పెరిగిపోయే విషపదార్థాలు ఎప్పటికప్పుడు నాశనమైపోతూంటే? అబ్బో.. అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అయితే ఈ అద్భుతాన్ని సాధించడం ఎలా? స్టాన్‌ఫర్డ్‌ బర్న్‌హామ్‌ ప్రీబిస్‌ మెడికల్‌ డిస్కవరి ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఓ మార్గం కనుక్కున్నారు. మనుషుల్లో కాదుగానీ.. కొన్ని రకాల పురుగులు ఒక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ కాలం బతుకుతున్నట్లు వీరు గుర్తించారు. పీ62 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్‌ విషతుల్యమన కణ ప్రొటీన్లను గుర్తించి నాశనమయ్యేలా చేస్తూండటం దీనికి కారణం.

కణాల్లోని చెత్త చెదారాన్ని తొలగించేందుకు ఉన్న ఆటోఫేగీ వ్యవస్థను బలోపేతం చేస్తే జీవితకాలం పెరుగుతుందని ఇప్పటికే చాలా పరిశోధనలు రుజువు చేశాయని ఈ ప్రొటీన్‌ ద్వారా ఆటోఫేగీ బలోపేతమవుతోందని మెలేన్‌ హాన్‌సెన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. నిన్నమొన్నటివరకూ శాస్త్రవేత్తలు ఈ కణ రీసైక్లింగ్‌ శరీరం మొత్తమ్మీద ఒకేలా ఉంటుందని అంచనావేశారుగానీ.. పీ62 ప్రొటీన్‌ వాడకం మొదలుకొని కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని తాజా పరిశోధన ద్వారా తెలిసింది. పీ62 కణాల్లోని మైటోకాండ్రియా, విషతుల్యమైన ప్రొటీన్లను రీసైకిల్‌ చేసేందుకు తరలిస్తాయని మెలేన్‌ వివరించారు. ఈ పరిశోధన ద్వారా అల్జైమర్స్‌ వంటి వ్యాధులకు కొత్త చికిత్స లభిస్తుందని అంచనా. పరిశోధన వివరాలు నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top