
పాలు... మెదడుకు మేలు
పాలు, పాల ఉత్పత్తులు మెదడుకు చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు...
కొత్త పరిశోధన
పాలు, పాల ఉత్పత్తులు మెదడుకు చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు మూడు గ్లాసుల పాలు తాగే అలవాటు ఉంటే, వయసు మళ్లిన దశలో అల్జిమర్స్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధుల బారిన పడే ముప్పు చాలా వరకు తప్పుతుందని చెబుతున్నారు. పాలు, పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు చేరిన ప్రమాదకర రసాయనా లను సమర్థంగా నిర్వీర్యం చేస్తాయని అంటున్నారు.
యూఎస్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో 60-85 ఏళ్ల వయసు గల వారి మెదళ్లకు ఎంఆర్‌ఐ స్కానింగ్ పరీక్షలు జరిపి, వాటిని అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇంతేకాదు, పాలలో ట్రిప్టోఫాన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిలో స్వాభావికంగానే నిద్రపట్టించే గుణం ఉంటుంది. కంటినిండా నిద్ర వల్ల మెదడు చురుగ్గా పనిచేసి, మెదడు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఈ విషయం మరో పరిశోధనలో వెల్లడైంది.