పెళ్లికి.. ఆరోగ్యానికి లింక్‌ ఇదిగో...

Here is the link to the health of the marriage - Sakshi

ఇంట్లో ఒడిదుడుకుల్లేకపోతే.. ఒంట్లో హాయిగా ఉంటుంది. ఈ విషయం మనకు తెలియంది కాదు.. అయితే వైవాహిక జీవితం గుండెజబ్బులపై కూడా ప్రభావం చూపగలదని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ శాస్త్రవేత్తలు తొలిసారి అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు  కాలంతోపాటు భార్య/భర్తతో తమ అనుబంధం మరింత బలపడిందనుకునే వారందరి ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయని.. బాడీ మాస్‌ ఇండెక్స్‌ మొదలుకొని కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు తగ్గిపోగా.. గుండెజబ్బుల విషయంలోనూ ఎంతో మెరుగుదల నమోదైందని 1980లో మొదలై ఇటీవలే ముగిసిన ఈ అధ్యయనం చెబుతోంది.

దాదాపు 620 మందిపై పాతికేళ్లపాటు ఈ అధ్యయనం జరగడం విశేషం. గతంలోనూ అనేక అధ్యయనాలు పెళ్లికీ.. ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ తాము తొలిసారి గండెజబ్బులకు.. పెళ్లికీ మధ్య ఉన్న లింకును తెలుసుకున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త బర్గ్‌ తెలిపారు. భార్య వంటి దగ్గరి వారి తిరస్కరణకు గురైన వారిలో సైటోకైన్స్‌ ఎక్కువగా ఉంటాయని. ఇవి శరీరంలో వాపు/మంటకు తద్వారా దీర్ఘకాలంలో అనేక ఇతర వ్యాధులకూ దారితీస్తుందని బర్గ్‌ వివరించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top