జిల్లాలోని లోక్‌సభ, శాసన సభాస్థానాలకు బరిలో దిగనున్న పార్టీ అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ మంగళవారం ప్రకటించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని లోక్‌సభ, శాసన సభాస్థానాలకు బరిలో దిగనున్న పార్టీ అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ మంగళవారం ప్రకటించింది. సమర్థత, ప్రజాదరణ కొలమానంగా రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. అన్ని స్థానాల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి సమర్థులైన అభ్యర్థులకే అవకాశం కల్పించింది. జిల్లా అభ్యర్థుల జాబితాలో సామాజిక సమీకరణలకు పార్టీ పెద్దపీట వేసింది. సగం సీట్లను బీసీలకు కేటాయించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని పార్టీ టికెట్‌లు పొందిన అభ్యర్థులు విశ్వాసం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ అభ్యర్థులు...
ఎల్బీనగర్ పుత్తా ప్రతాపరెడ్డి
మహేశ్వరం దేప భాస్కర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం ఈసీ శేఖర్‌గౌడ్
మల్కాజిగిరి జి. సూర్యనారాయణరెడ్డి
ఉప్పల్ అంపాల పద్మారెడ్డి
శేరిలింగంపల్లి ముక్కా రూపానందరెడ్డి
వికారాబాద్ చింతల క్రాంతికుమార్
రాజేంద్రనగర్ ముజ్తబా అహ్మద్ సయ్యద్
కుత్బుల్లాపూర్ కొలను శ్రీనివాసరెడ్డి