నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి
వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం విశాఖ లోక్‌సభ పరిధిలోని గాజువాక, ఎస్.కోట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ తెలిపారు.
విశాఖపట్నం,న్యూస్‌లైన్: వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం విశాఖ లోక్‌సభ పరిధిలోని గాజువాక, ఎస్.కోట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ తెలిపారు. ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. ఉదయం 8.30 గంటలకు స్టీల్‌ప్లాంట్ గేట్ వద్ద సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 11 గంటలకు జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం విశాఖ బీచ్‌రోడ్‌లో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
