విద్యాప్రదాత వైఎస్ | we are getting good position due to ysr's fee reimbursement scheme | Sakshi
Sakshi News home page

విద్యాప్రదాత వైఎస్

Mar 21 2014 2:53 AM | Updated on Oct 1 2018 5:40 PM

ఆర్థికస్తోమత లేని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఖమ్మం హవేలి/కారేపల్లి, న్యూస్‌లైన్: ఆర్థికస్తోమత లేని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా జిల్లాలో  2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 వరకు ఎందరో విద్యార్థులు లబ్ధిపొందారు. ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) విద్యార్థులు 33,595 మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం దక్కింది. వీరికి ప్రభుత్వం రూ.62,47,12,374 చెల్లిస్తోంది. 2005-06 నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు జిల్లాలో 2,27,866 మంది బీసీ విద్యార్థులు రూ.196,44,68,070 ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ యేడాది 1182 మంది మైనారిటీ విద్యార్థులు రూ.36,73,384 ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా విద్యను అభ్యసించారు. జిల్లాలోనే లక్షల సంఖ్యలో విద్యార్థులు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యను కొనసాగిస్తున్నారు. కొందరు చదువు పూర్తిచేసి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన విద్యార్థుల జీవితాలను ఓసారి పరిశీలిస్తే...
 ‘మాది సాధారణ రైతు కుటుంబం. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా బీఫార్మసీ పూర్తి చేశాను. ఇప్పుడు ఎంఫార్మసీ చదువుతున్నాను. రాజశేఖరరెడ్డి దయ వల్లే పైసా ఖర్చు లేకుండా ఉన్నత విద్యను పూర్తి చేయగలుగుతున్నాను.’


 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లేకపోతే నా చదువు ఆగిపోయిది అంటోంది కారేపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని అలేఖ్య. వైఎస్‌ఆర్ మా పాలిటి దైవమని వారి ఇంటిల్లిపాది ఆయన చిత్రపటం వద్ద పూజలు చేస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..‘మాది పేద కుటుంబం. మా అమ్మ ఆరోగ్యం బాగుండదు. నాన్న ఓ ప్రైవేటు కళాశాలలో క్లర్క్‌గా పని చేస్తున్నారు. నాన్నకు వచ్చే కొద్దిపాటి జీతంతోనే మా కుటుంబమంతా బతకాలి. అమ్మానాన్నలకు మేము ముగ్గరు పిల్లలం. మా అన్నయ్య వీరేందర్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే బీటెక్ (2008-12) పూర్తి చేశాడు. ఇప్పుడు ఎంటెక్ కూడా ఈ పథకం ద్వారానే చదువుతున్నాడు.

మా అక్క లక్ష్మీస్వరూప 2012లో ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారానే ఎంబీఏ పూర్తి చేసింది. వైఎస్‌ఆర్ అధికారంలోకి రాకముందు రూ.30వేలు అప్పుతెచ్చి నాన్న అన్నయ్యకు ఫీజు చెల్లించారు. ఆ పరిస్థితుల్లో ఇక నా చదువుకొనసాగదేమో అనుకున్నాను. 2009లో వైఎస్‌ఆర్ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతే నాకు ప్రాణం లేచివచ్చినట్టయింది. మా కుటుంబం కూడా అప్పులపాలు కాకుండా చదువులు పూర్తిచేసే వెసులుబాటు లభించింది. అందుకే మానాన్న కాటేపల్లి నర్సింహారావుగారు ఎప్పుడూ అంటుంటారు. ‘బతికున్నంత కాలం మనం వైఎస్‌ఆర్‌ను మరిచిపోకూడదు..ఆయన చేసిన మేలునూ మరిచిపోకూడదు..’ అని. అవునూ నిజమే దేవుడులాంటి రాజశేఖరరెడ్డి లేకపోయివుంటే మేము ముగ్గరం కూడా ఉన్నత విద్యకు దూరమయ్యేవాళ్లం. ఒకవేళా చదివినా ఆర్థికంగా మా కుటుంబం దిగజారిపోయేదే. అందుకే  మా ఇంట్లో వైఎస్సార్‌ను తలవని క్షణం ఉండదు..మొక్కని రోజు ఉండదు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement