సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్న ట్టు డీఆర్వో బి.హేమసుందర్ శనివారం తెలిపారు.
విజయనగరం కంటోన్మెంట్/కురుపాం/కొమరాడ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్న ట్టు డీఆర్వో బి.హేమసుందర్ శనివారం తెలిపారు. ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నా రు. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం పెద చామలాపల్లి( పోలింగ్ కేంద్ర 134), కురుపాం నియోజకవర్గంలోని చెక్కవలస (పోలింగ్ కేంద్రం 192) గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించిందన్నారు. చెక్కవలసలో 136 ఓట్లు పడిన తరువాత ఈవీఎం మొరాయించిందనీ, ఆ తరువాత ప్రిసైడింగ్ ఆఫీసర్ కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారన్నారు. అయినా మరో రెండు ఓట్లు పడిన తర్వాత ఆగి పోవడంతో రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. పెదచామలాపల్లిలో 507 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడం, మళ్లీ కొత్త ఈవీఎం కూడా 9 మంది ఓట్లు వేశాక మొరాయించిందన్నారు. దీంతో ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోలిం గ్‌లో ఓటర్లకు కుడి చేయి మధ్య వేలికి సిరా చుక్కను వేస్తామన్నారు