ఇంటివారి మాట రామోఛీ..! | ramijira rao family hated ramoji! | Sakshi
Sakshi News home page

ఇంటివారి మాట రామోఛీ..!

Apr 6 2014 2:10 AM | Updated on Aug 10 2018 8:06 PM

ఇంటివారి మాట రామోఛీ..! - Sakshi

ఇంటివారి మాట రామోఛీ..!

ఓసారి నాకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నాన్నగారు కాల్ చేశారు. గ్లాసు పట్టుకోవడానికి కూడా ఓపిక లేని స్థితి. కార్డ్‌లెస్ ఫోన్ చెవి దగ్గర పెట్టారు అమ్మ.


కె.జి.రాఘవేంద్రరెడ్డి
 ఓసారి నాకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్న సమయంలో నాన్నగారు కాల్ చేశారు. గ్లాసు పట్టుకోవడానికి కూడా ఓపిక లేని స్థితి. కార్డ్‌లెస్ ఫోన్ చెవి దగ్గర పెట్టారు అమ్మ. అటువైపు నుంచి ఆయన నానా మాటలు అంటున్నారు. నేను ఒకటే ఏడుపు. అమ్మ దూరం నుంచి చూసి వద్దు.. వద్దు.. అంటోంది. సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేదు. అలాంటి సమయంలో నాకు సపోర్టు చేయాల్సింది పోయి.. అన్ని మాటలు అనాలా అని బాధపడ్డాను
 - రామోజీని ఉద్దేశించి కన్న కొడుకు సుమన్  బాధతో అన్న మాటలివీ.
 
 
 వైస్రాయ్ హోటల్ కుట్రలో చంద్రబాబుకు సహకరించారు. వెంకటేశ్వరరావును, హరికృష్ణను అవసరం తీరాక చంద్రబాబు దూరం పెట్టారు. ఈ రకంగా రామారావు మృతికి చంద్రబాబు-రామోజీరావు పరోక్షంగా కారకులయ్యారు.
 - రామోజీ అన్న కొడుకు చెరుకూరి చంద్రమౌళి అభిప్రాయం ఇదీ..
 
 విశాఖ సీతమ్మధారలో ఈనాడు స్థలం గురించి తెలుసుకుంటే రామోజీ ఇలాంటి వాడా అంటారు. ఆయనవరకు వచ్చే సరికి విలువలు లుప్తం. జీరో
 - రామోజీ తోడల్లుడు అప్పారావు వ్యాఖ్యలివీ
 
 చంద్రమౌళి పుస్తకంలో..
 
 నిత్యం ‘సత్యం నినదించుగాక’ అంటూ విషపు రాతలను అచ్చొత్తే రాజగురవింద రామోజీ... శనివారం తన పత్రిక ‘ఈనాడు’లో ఎప్పట్లాగే ఒక పేజీని వైఎస్ కుటుంబంపై బురదజల్లేందుకు కేటాయించారు. ముందే రామోజీ.. ఆపై ఎన్నికలు.. ఇంకేముంది.. రెచ్చిపోయారు! వైఎస్ కుటుంబ ప్రతిష్టను మంటగలపాలి.. జగన్ ఇమేజీని దెబ్బతీయాలి.. ఎన్నికల ముంగిట బాబుకు నాలుగు ఓట్లు పడేలా చూడాలి.. ఇదే ఏకైక ఎజెండాగా సాగుతున్న పచ్చ కుట్రలో భాగంగా ఆత్మ‘కథ’ను అలికేశారు. వైఎస్ ఇంట్లో పనిచేసే పని మనిషి సూరీడు చెప్పారంటూ విషాన్ని చిమ్మిన రామోజీ గురించి ఆయన సొంతవారే ఏమన్నారో చూడండి...
 
 సుమన్ మాట ఇదీ..
 
 ఒంట్లో క్యాన్సర్ పుడితే గెలవొచ్చు. కానీ ఇంట్లో క్యాన్సర్ పుడితే మాత్రం గెలవలేం. దాని చేతుల్లోనే ఓడిపోయాను అనిపించింది.. నాన్నగారి మనసులో ఉన్నదొకటి. చేసిందొకటి.


 ఆయన నా ఆరోగ్యం గురించి ఎప్పుడూ బాధపడతారని అందరూ అంటూ ఉంటారు. నిజంగా ఆయనకు నా వ్యాధి మీద కన్‌సర్న్ ఉంటే నాకు ఇంత మానసిక వ్యధని మిగులుస్తారా? ఈ బాధే నా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. బావిలో ఎన్ని నీళ్లున్నా అవి ఉప్పగా ఉంటే ఎవరికి ఉపయోగం? ఆయన నన్ను వనవాసాలకు పంపారు.


 ఆయన గొప్ప వ్యక్తి కావచ్చు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు కావచ్చు. అయితే, మంచి తండ్రి మాత్రం కాదు (హి మైట్ బి ఏ గ్రేట్ మేన్, గ్రేట్ పర్సనాలిటీ. బట్ హి మైట్ నాట్ బి ఏ గుడ్ ఫాదర్)


 ఈ టీవీలో ఒక ప్రోగ్రాంకు రూ.50 వేలు ఖర్చు అయితే రూ.25 లక్షలు వచ్చిన సందర్భాలున్నాయి. నేను మాత్రం నెలకు రూ.50 వేలు మాత్రమే తీసుకున్నాను. ఈటీవీ బాగుండాలని, నాన్న గారు నన్ను చూసి గర్వపడాలని ఎంతో కష్టపడి పనిచేశాను. నాన్న గారికి మాత్రం నా రాతలు మొదటి నుంచీ నచ్చేవికావు.


 అంతరంగాలు నేను దొంగచాటుగా రాశాను. ఇంట్లో చూస్తే ఎక్కడ స్క్రిప్ట్ పారేస్తారో, ఎక్కడ రాయద్దంటారో అని భయం.


 ఎవరైనా నా సీరియల్స్ బాగున్నాయని పొగిడితే లేచి వెళ్లిపోయేవారు. ఎంతో బాగా నడుస్తున్న నా సీరియల్స్‌ను ఎప్పుడు మూసేస్తావు? అది ఎప్పుడు ఆపేస్తావు అని అడిగేవారు. ‘విధి’ సీరియల్ 15-20 రేటింగ్స్ ఉన్నప్పుడు బలవంతంగా ఆపించేశారు.


 ఒకసారి బోర్డు మీటింగులో కిరణ్, ఇతర బోర్డు సభ్యులు, నా కింద పనిచేసే వాళ్లు అందరూ ఉండగా... నన్ను తిట్టారు. ‘నువ్వ లేకపోతే అంతా బానే ఉండేది’ అని అన్నారు. ఆ రోజు నాకు బాగా గుర్తు. అమ్మ దగ్గరకు వెళ్లి బాధపడ్డాను. ఇలా అందరి ముందు నన్ను ఎన్నిసార్లు అవమానించారో చెప్పలేను.


 అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఎప్పుడు వచ్చి ఆయన నా మీద విరుచుకుపడతారో అని
 
 భయం. ఒక్కసారి కూడా ఆయన నన్ను మెచ్చుకోలేదు.


 ఆరోగ్యం బలహీనంగా ఉందని ఓసారి ఫిల్మ్‌సిటీ ఇంట్లో 9 నెలలు ఉన్నాను. అప్పుడు నాన్నగారు వచ్చి నీ సంతకాలు కావాలి. ఎందుకో నీకు తర్వాత చెప్తాను. నువ్వు నన్ను నమ్ముతావు కదా అని బోలెడు పేపర్లు ఇచ్చారు. సంతకాలు పెట్టేదాకా పొద్దున, రాత్రి నన్ను చూడటానికి వచ్చేవారు. ఈటీవీలో వేరే వారి వాటాలున్నాయి.. కొన్ని కార్యక్రమాలు నువ్వు చేయి. కొన్నింటినీ నేను చూసుకుంటానన్నారు. నీకంతా నయమైన తర్వాత ఈటీవీ తిరిగి ఇచ్చేస్తాను అన్నారు.


 ఒకవైపు ప్రాణం పోతోంది. మరోవైపు ప్రాణాన్నే (ఈటీవీని) ఇచ్చేయమంటున్నారు. ఆలోచించే శక్తి లేక సంతకం పెట్టాను. అమెరికాకు వెళ్లి ట్రీట్‌మెంటు తీసుకుని వచ్చిన తర్వాత ఈటీవీని అడిగితే కుదరదన్నారు.


 రామోజీరావు కొడుకుగా పుట్టడం మహాపాపం. నేను ఎక్కడో చిన్న గుడిసెలో పుట్టి ఉంటే ఆయనే నన్ను చేరదీసి ఆకాశానికి ఎత్తేవారు. కానీ ఆయన కొడుకుగా పుట్టడం వల్ల నాతో పాటు నా సరస్వతి కూడా నానా కష్టాలు పడాల్సి వచ్చింది.


 రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తి అయ్యిండొచ్చు. కానీ సరస్వతి ఆయన దగ్గర ఉండదు. లక్ష్మీ అయినా కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఒక రోజన్నా క్షమించి ఉంటుంది. సరస్వతి మాత్రం డబ్బుకి లొంగదు. దాన్ని గౌరవిస్తే అది నిలుస్తుంది. ఎప్పటికైనా ఈ పెట్టుబడిదారులందరికీ తెలిసివచ్చే విషయమే ఇది.
 
 చంద్రమౌళి పుస్తకంలో..
 
 రామోజీ చైనాకు రహస్యంగా దేశంలోని విషయాలు చేరేవేసే వారన్న విషయం నాకు పెద్దయ్యాక తెలిసింది. చైనాతో యుద్ధం సమయం 1962లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక  లెటర్ పోస్ట్ చేయమన్నారు. నాకు భయమేసి ఏముందని అంటే... ‘ఈ ఉత్తరం చైనా వాళ్లకే. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకు. చెప్పావనుకో నాకు శిక్షే. ఈ ఉత్తరంలో ఏముందనుకున్నావు. దేశం మునిగిపోయే విషయాలున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు రహస్యంగా చెబుతుంటాం. అంటే నేను ఈ దేశంలో ఉండే చైనా ఏజెంట్‌నన్న మాట’’ అని నేను చిన్నగా ఉన్న సమయంలో మా బాబాయ్ రామోజీ నాకు చెప్పారు.  


ఇలా చైనాకు ఏజెంటుగా పనిచేసి చైనా డబ్బుతో ఆయన హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు.
 

ఏ రాజకీయ పార్టీ అయినా నేనే కింగ్‌మేక ర్‌ని అన్న అహంకారం ఆయనలో చాలా పరిగిపోయింది. ఆయనవన్నీ అండర్ వరల్డ్ రాజకీయాలే.


 ఈటీవీ ఏర్పాటు ఆలోచన సుమన్‌ది.  ఆ ఆలోచనను మా బాబాయి సొంతం చేసుకున్నాడు. ఇదీ ఆయన మనస్తత్వం.


 రామోజీ బాబాయ్ ప్రతి దానికీ పేచీలు పెట్టుకోవడం, కోర్టులకు వెళ్లడం, ఈ చట్టం నాకు చెల్లదని వాదించడం ఇదంతా ఒక పెద్ద కళ.
 

రామోజీ బాబాయ్‌కి చాలా ఆరోపణలు ఎప్పుడూ తరగని నిధిలా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో అనవసరంగా వాళ్లకీ, వీళ్లకీ భూములు కారుచౌకగా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నారనే ఏడుపు ఒకటి ఉంటుంది..


  చంద్రబాబు.. రామోజీరావుకు పూర్తి విధేయుడై మెలిగారు. రోజూ విషయాలన్నీ రామోజీరావుతో చర్చించి కానీ నిర్ణయం తీసుకోరు.
 
 తోడల్లుడు చెప్పిందిదీ..
 
 రామోజీరావు జనంలో లేరు. ఆయన జనం నుం చి దూరంగా వెళ్లిపోయారు. ఆయన పయోముఖ విష కుంభం. ఆయన రాజగురువు కాదు గురి వింద. అడ్డువచ్చిన వారిని తొలగించుకోవడం ఆయన సిద్ధాంతం.
 
ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు చంద్రబాబు, రామోజీరావు కలిసి ఎలా కుట్ర పన్నారో రాష్ర్ట ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్‌పై జరిగిన కుట్రకు నేను సాక్షిని.
 

చంద్రబాబు డాల్ఫిన్ హోటల్‌లో, రామోజీ ఇక్కడ ఈనాడు గెస్ట్‌హౌస్‌లో ఉండి మంతనాలు చేశారు. వాస్తవానికి ఈరోజు చంద్రబాబు వెంట కొందరే ఉన్నారు. వైస్రాయ్‌లో వీరంతా కలుస్తున్నారు. కానీ మరుసటి రోజు పత్రికలో 120 మంది వైస్రాయ్‌కు వెళ్లిపోయారని రామోజీ రాశారు. వాస్తవానికి 50-60 మంది ఉంటారేమో? పత్రికల్లో వచ్చిన తర్వాత నిజంగా మెజారిటీ ఉందేమోనని అంతా వెళ్లిపోయారు. అదీ జరిగిన కుట్ర. ఈ దారుణాతి దారుణమైన కుట్రను మహానుభావుడు ఎన్టీఆర్ ఎంత క్షోభకు గురయ్యాడో.


 విలువలని చెబుతూ పత్రికను ఎలా వాడుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. చంద్రబాబు కూడా దాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు.
 

చంద్రబాబుకు కుర్చీ కావాలి. ఈయనకు సేఫ్టీ కావాలి. ఈనాడు పెట్టిన కొత్తలో విలువలు ఫాలో అయ్యాం. కొన్ని బాధలు వచ్చి పేపరును ఉపయోగించుకోవడం మొదలు పెట్టాయి.


 ఆ రోజుల్లో తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం. అయితే, ఎన్టీఆర్ మాట వినడం లేదని విభేదించడం ప్రారంభించారు. ఆయనకు బాబు తోడయ్యారు. రామోజీలో స్వార్థం పెరిగిపోయింది. నేను, కష్ణమూర్తి బయటకు వచ్చాం.


 

మార్గదర్శి డిపాజిట్లు అనధికారికంగా సేకరించారు. దీనికి సమాధానం లేదు. నిమేష్ కంపానీ విషయంలో స్పందన ఏదీ?
 

వాళ్లది అన్యాక్రాంతం... వీళ్లది అన్యాక్రాంతం అంటారు. మరి విజయవాడలో, విశాఖలో ఉన్న సైట్లు ఎందుకు వదలడం లేదు. అదేమంటే పేపరు ఉంది.
 

టీడీపీ హయంలో మద్యనిషేధం అన్నారు. తర్వాత వదిలేశారు. ఆయనలో ఎప్పుడు స్వార్థం పురివిప్పిందో అప్పుడే బయటకు వచ్చాం. ఇచ్చింది పుచ్చుకున్నాను. ఒక్క విజయవాడ సైటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. అప్పుడు ఆయన ఎలా ఉంటారో జనం చూస్తారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement