మీది జర్నలిజమా.. ఉన్మాదమా ?: వాసిరెడ్డి పద్మ | Vasi reddy padma slams Ramoji rao | Sakshi
Sakshi News home page

మీది జర్నలిజమా.. ఉన్మాదమా ?: వాసిరెడ్డి పద్మ

Apr 6 2014 4:15 AM | Updated on Aug 29 2018 3:33 PM

మీది జర్నలిజమా.. ఉన్మాదమా ?: వాసిరెడ్డి పద్మ - Sakshi

మీది జర్నలిజమా.. ఉన్మాదమా ?: వాసిరెడ్డి పద్మ

తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఈనాడును, పాత్రికేయ విలువలనూ పణంగా పెట్టి ఒక నీచమైన ప్రయత్నానికి రామోజీరావు ఒడిగడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.

* రామోజీరావుపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ
* బాబును అధికారంలోకి తెచ్చేందుకు నీచ యత్నాలు
* ఎక్కడేం జరిగినా జగన్‌కు ముడిపెడుతూ రాతలు
* నిరూపిస్తే ‘సాక్షి’ని రాసిస్తామన్న సవాలును స్వీకరించాలి

 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఈనాడును, పాత్రికేయ విలువలనూ పణంగా పెట్టి ఒక నీచమైన ప్రయత్నానికి రామోజీరావు ఒడిగడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. తెరవెనుక ఉండి రాజకీయాధికారాన్ని అనుభవించడానికి అలవాటుపడిన రామోజీరావు మళ్లీ అదే రాజకీయాధికారం కోసం వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. త న సొంత ఎజెండాను సాధించడం కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రెండు దేశాల మధ్య వైరుధ్యం కలిగిన ఒక సంస్థకు సంబంధించిన కేసులో అమెరికాలో అభియోగాలు నమోదైతే అందులో జగన్ పాత్ర ఉందని చంకలెగరేసుకుంటూ రామోజీ ఈనాడులో కథనాలు రాశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఇందులో జగన్ పాత్ర ఉందని నిరూపిస్తే సాక్షిని రామోజీకి స్వాధీనం చేస్తామని, లేకుంటే ఈనాడును తమకు స్వాధీనం చేయాలని సాక్షి విసిరిన సవాలును స్వీకరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సరిపోదని, తాము విసిరిన సవాలుకు సమాధానం చెప్పాలని నిలదీశారు. వైఎస్, జగన్‌పై వార్తలు రాస్తూ జర్నలిజాన్ని రామోజీరావు ఉన్మాదస్థాయికి తీసుకెళుతున్నారని దుయ్యబట్టారు. ఆమె ఏమన్నారంటే...
 
 హాఒక నాయకుడిని అధికారంలోకి తేవాలన్నది రామోజీ సొంత ఎజెండా కావొచ్చు, కానీ అందుకు జర్నలిజాన్నే పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. కేసుతో జగన్‌కు సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి మెలికను ఆయన వేలికి చుట్టాలని రామోజీ, కొన్ని ఇతర పత్రికలు ప్రయత్నిస్తున్నాయి.
 
 హావైఎస్ మరణం తరువాత రాష్ర్టంలో ఇక తమకు అడ్డు ఉండదని చంద్రబాబు, రామోజీ, తదితరుల బృందం భావించింది. అయితే గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి వైఎస్ మాదిరిగా జగన్ ఒక పెద్ద నాయకుడుగా ఎదుగుతుండటంతో వారు భయపడిపోతున్నారు. తమ శిరస్సుపై పాదం మోపే శ్రీమహావిష్ణువు రూపంలో జగన్ వారికి కనిపిస్తున్నారు. అందుకే అన్ని ఎజెండాలను పక్కనబెట్టి, ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈనాడులో జగన్‌పై అవాస్తవ కథనాలు వండి వార్చడమే పనిగా పెట్టుకున్నారు.
 
 హావైఎస్ మరణించిన వంద రోజుల్లోపే కుట్రపూరితంగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం తెరలేపితే ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్ మరణం తరువాత ఒక్క సాగునీటి ప్రాజెక్టు ముందుకు సాగకపోతే ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు? విభజనకు వ్యతిరేకంగా రామోజీ ఒక్క సంపాదకీయమైనా రాశారా? నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటకంగా పరిపాలిస్తూ ఉంటే ప్రజల తరపున ఈనాడు ఒక్కసారైనా నిలబడిందా? ప్రజలమీద విపరీతంగా విద్యుత్ చార్జీల భారం, ఆర్టీసీ చార్జీల బరువు మోపితే ఏనాడూ ఎందుకు స్పందించదు?

* వైఎస్ మరణించాక గత ఐదేళ్లలో ఈనాడు పత్రిక, రామోజీరావు ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడింది లేదు. మరణించిన వైఎస్సార్, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లుతూ పుంఖానుపుంఖాలుగా పేజీల కొద్దీ వార్తలు రాయడంపైనే ఆసక్తిని చూపింది. ఈనాడు, కొన్ని పత్రికలు కలిసి జగన్‌కు వ్యతిరేకంగా ఎంత కుట్రపూరితంగా రాస్తే ప్రజలు ఆయనను అంతగా అక్కున చేర్చుకుంటున్నారు. అది 2 లోక్‌సభ, 20 శాసనసభ స్థానాల ఉప ఎన్నికల సందర్భంగా రుజువైంది.
 
 * 2004లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రామోజీరావు ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. 2009 ఎన్నికలకు ముందు విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు, వైఎస్‌కే పట్టం గట్టారు. ఇపుడు 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని నిలువరించేందుకే జగన్‌పై వ్యతిరేక కథనాలు మళ్లీ మొదలు పెట్టారు.
 * వైఎస్ మరణించినపుడు ఆయన చేసిన మంచి పనులవల్ల రాష్ట్రం అశ్రుధార కార్చిందని రామోజీరావు సంపాదకీయం రాశారు.
 
* చంద్రబాబు ఎన్నికల్లో సొంతగా పోటీ చేయలేక ముందు నుంచి పవన్, వెనుక నుంచి పాల్, ఇటు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి జేపీ ఇలా అందరి మద్దతు తీసుకుని వస్తున్నారు. ఈనాడుతో సహా అందరూ కలిసి ఎత్తుతున్నా చంద్రబాబు పైకి లేవలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement