పోలీసులు కొట్టారన్న మనఃస్తాపంతో ఓటరు ఆత్మహత్య | police beating : Voter suicide | Sakshi
Sakshi News home page

పోలీసులు కొట్టారన్న మనఃస్తాపంతో ఓటరు ఆత్మహత్య

Apr 6 2014 4:48 PM | Updated on Aug 21 2018 5:46 PM

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఓటర్ను పోలీసులు కొట్టడంతో మనఃస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు.

మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఓటర్ను పోలీసులు కొట్టడంతో మనఃస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

జయన్న అనే ఓటరు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటర్ల జాబితాలో జయన్న పేరులేదు. దాంతో తన పేరు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. సిబ్బందితో వాగ్వివాదనికి దిగారు. పోలీసులు ఆగ్రహంతో జయన్నను చితకబాదారు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన జయన్న పోలీసులు చితకబాదారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement