కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
రాయికల్/పెద్దపల్లి/గోదావరిఖని, న్యూస్‌లైన్: కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా ఒకే రోజు ఏకం గా నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. జగిత్యాల, కోరు ట్ల, ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఏ కధాటిగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
అంతకుముందు రోజు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి సభల్లో పాల్గొనున్న కేసీఆర్ .. ఆ తర్వాత గోదావరిఖనిలో నిర్వహించే సభకు హాజరవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమానికి పురిటగడ్డగా పేరొందిన కరీంనగర్ జిల్లాలో అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆయన ఎక్కడా లేనివిధంగా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం.