వారణాసిలో నామినేషన్ దాఖలుచేసిన మోడీ | Narendra Modi files nomination from Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసిలో నామినేషన్ దాఖలుచేసిన మోడీ

Apr 24 2014 2:47 PM | Updated on Oct 17 2018 6:27 PM

వారణాసిలో నామినేషన్ దాఖలుచేసిన మోడీ - Sakshi

వారణాసిలో నామినేషన్ దాఖలుచేసిన మోడీ

జన సునామీ వెంటరాగా.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నాడు వారణాసి లోక్సభ నియోజకవర్గానికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

జన సునామీ వెంటరాగా.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నాడు వారణాసి లోక్సభ నియోజకవర్గానికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన వెంటన సన్నిహిత సహచరుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు రవిశంకర్ ప్రసాద్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.

అంతకుముందు నరేంద్రమోడీ వారణాసి వీధుల్లో భారీ స్థాయిలో రోడ్షో నిర్వహించారు. ఆయన వెంట భారీ స్థాయిలో జనం నడిచారు. రోడ్లమీద ఎక్కడా అంగుళం కూడా ఖాళీ లేనంత స్థాయిలో అభిమానులు పోటెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement