పుర‘పోరు’ ముగిసింది.. | municipal elections completed successfully | Sakshi
Sakshi News home page

పుర‘పోరు’ ముగిసింది..

Mar 31 2014 2:30 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ నగరంలో ఆదివారం 50 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌లో 2,42,440 ఓటర్లు ఉండగా, 1,32,617 ఓట్లు పోల్ అయ్యాయి. 54.70 శాతంగా నమోదు అయింది.

నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలో ఆదివారం  50 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌లో 2,42,440 ఓ టర్లు ఉండగా, 1,32,617 ఓట్లు పోల్ అయ్యాయి. 54.70 శాతంగా నమోదు అయింది.

అయా డివిజన్లలో ఓటర్ల సరళిని పరిశీ లిస్తేఅత్యల్పంగాఓట్లునమోదయిన డివిజన్లు..
 15వ డివిజన్లో 8,682 ఓటర్లు ఉండగా     4,427 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 41.70 శాతం నమోదు అయింది.
  9వ డివిజన్లో 3,890 ఓటర్లకుగాను 1,980 ఓట్లు నమోదయ్యాయి. 41.79 శాతం నమోదైంది.

 అత్యధికంగా ఓట్లు నమోదైన కేంద్రాలు..
 43వ డివిజన్లో 5,176 ఓట్లు ఉండగా 3,703 ఓట్లు పోలయ్యాయి. 71.53 శాతం నమోదైంది.
 48వ డివిజన్లో 3చ509 ఓట్లుకుగాను 2,406 ఓట్లు పోలయ్యాయి. 69.59 శాతం నమోదైంది.
 39వ డివిజన్లో 5,227 ఓట్లకుగాను 3443 ఓట్లు పోలయ్యాయి. 65.84 శాతం నమోదైంది.
 44వ డివిజన్లో 4,486 ఓట్లకుగాను 2,920 ఓట్లు నమోదయ్యాయి. 65.09 శాతం నమోదైంది.
 కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాపర్తి సుజాత పోటీచేస్తున్న 47వ డివిజన్లో 4,343 ఓట్లకుగాను 2,418 ఓట్లు పోలయ్యాయి. 55.69 శాతం నమోదైంది.

 ఆర్మూర్
   ఆర్మూర్‌లో  69.77 శాతం
 ఆర్మూర్, న్యూస్‌లైన్:   ఉదయం 7 గంటల వరకు 09 గంటల వరకు 5,199 ఓట్లు పోల్ కాగా 15 శాతం పోలింగ్ నమోదైంది.
 9 గంటల నుంచి 11 గంటల వరకు 7,087 ఓట్లు పోల్ కాగా 20.15 శాతం పోలింగ్ నమోదైంది.
  11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 18,308 ఓట్లు పోల్ కాగా 52.68 శాతం పోలింగ్ నమోదైంది.
 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు 22,100 ఓట్లు పోల్ కాగా 63.6 శాతం పోలింగ్ నమోదైంది.
 మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24,246 ఓట్లు పోల్ కాగా 69.77 శాతం పోలింగ్ నమోదైంది.
  ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపించారు. పట్టణంలో సవరించిన జాబితా ప్రకారం 34,752 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 17,144 మంది ఉండగా మహిళా ఓటర్లు 17,608 మంది ఉన్నారు. మొత్తం 69.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొనడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement