నేడు హుజూర్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన | KCR TOUR in huzurnagar | Sakshi
Sakshi News home page

నేడు హుజూర్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన

Apr 9 2014 3:01 AM | Updated on Aug 15 2018 9:17 PM

నేడు హుజూర్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన - Sakshi

నేడు హుజూర్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హుజూర్‌నగర్‌కు రానున్నారు. హుజూ ర్‌నగర్ నియోజకవర్గ టీఆ ర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ అమరవీరుడు

హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం హుజూర్‌నగర్‌కు రానున్నారు.  హుజూ ర్‌నగర్ నియోజకవర్గ టీఆ ర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ అమరవీరుడు  శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు సీటు కేటాయిం చారు. ఆమెకు మద్దతుగా జరిగే బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. 
 షెడ్యూల్ ఇలా..
 
 కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. అనంతరం సాయిబాబా థియేటర్ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారు. 
 
 భారీగా జనసమీకరణ
 సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిలు  నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తూ జన సమీకరణ చేపడుతున్నారు. 2006లో నాటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మొదటిసారిగా హుజూర్‌నగర్‌లో బహిరంగసభలో పాల్గొనగా రెండవసారి ఇక్కడికి వస్తున్నారు.
 
 బహిరంగసభను విజయవంతం చేయాలి
 హుజూర్‌నగర్‌లో బుధవారం జరగనున్న  కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కోరారు.  మంగళవారం పట్టణంలోని సాయిబాబా థియేటర్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలుగా శంకరమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, జేఏసీలు అధికసంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement