జట్టుకడితే ఫట్టే..!


* బాబు... భస్మాసురం

*  జట్టు కట్టిన పార్టీల పుట్టి ముంచే ఘనుడు

*  2004లో బీజేపీకి మర్చిపోలేని భంగపాటు

*  కేంద్రంలో అధికారమే కోల్పోయిన కమలనాథులు

*  2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలకూ అదే అనుభవం

*  టీడీపీతో ‘మహా కూటమి’ కట్టి మట్టికరిచిన వైనం

*  ఇప్పుడు మళ్లీ మిత్రుల ‘వేట’లో టీడీపీ అధ్యక్షుడు


 


సీహెచ్ శ్రీనివాసరావు, హైదరాబాద్: వన్ ప్లస్ వన్ టూ వంటి సాధారణ లెక్కలు రాజకీయాల్లో పని చేయవు. కొన్ని సందర్భాల్లో రెండు కంటే ఎక్కువ కావచ్చు, మరికొన్నిసార్లు సున్నాగానూ మారొచ్చు. గత రెండు సాధారణ ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలబొప్పి కట్టించిన కూటమి ప్రయో గమే ఇందుకు మంచి ఉదాహరణ. 2004లో బీజేపీతో అంటకాగినా, 2009లో టీఆర్‌ఎస్, వామపక్షాలను కౌగిలించుకుని ‘మహా కూటమి’ అన్నా ప్రజలు మాత్రం బాబును నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తెలిసిందే. 2004-09 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా విఫలమై అపకీర్తిని మూటగట్టుకున్న టీడీపీ, ఆయన హఠాన్మ రణం అనంతరం గత నాలుగున్నరేళ్లుగానైతే ఏకంగా అధికార పార్టీతోనే అంటకాగుతూ ‘కొత్త చరిత్ర’ సృష్టించింది.

 

 ఈ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఈసారి ‘మహా మహా కూటమి’ కట్టినా కష్టమేనంటూ టీడీపీ నేతలం తా ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. అయినా సరే, చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేరు. ప్రజల్లో గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన తర్వాత పొత్తులు పెట్టుకున్నా, ఆల్ ఫ్రీ హామీలు గుప్పించినా లాభముండదన్న వాస్తవాన్ని పక్కన పెట్టారు. ఈసారి కూడా బీజేపీ, లోక్‌సత్తాలతో పాటు జన సేన... ఇలా అదీ ఇదీ అని లేకుండా ఏ పార్టీ దొరికితే ఆ పార్టీతో పొత్తుల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు! కానీ 2009 నాటి టీఆర్‌ఎస్, వామపక్షాల చేదు అనుభవం నేపథ్యంలో బాబు ధృతరాష్ట్ర కౌగిలి బారిన పడేందుకు బీజేపీ సహా ఏ పార్టీలూ ఇష్టపడటం లేదు.

 

వాత పెట్టుకోబోయి బొక్క బోర్లా

 వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఎదిరించడం తన ఒక్కడి వల్ల కాదని అర్థమైన చంద్రబాబు, 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహా కూటమికి తెర తీశారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనీ, జయప్రకాశ్ నారాయణ లోక్‌సత్తా పార్టీనీ కూటమిలోకి లాగేందుకు శాయ శక్తులా ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు. ఊరూవాడా హోరెత్తించిన నగదు బదిలీ మొదలుకుని కలర్ టీవీలు, ఉచిత బియ్యం, వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య... ఇలా కనీసం 40 దాకా ఉచిత హామీలిచ్చారు. చిరంజీవికి మద్దతుగా అనుచర సినీ గణం ప్రచారం చేయడంతో బాబు కూడా నందమూరి వంశాన్ని బరిలో దించారు.

  బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో ముమ్మరంగా ప్రచారం చేయించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయించి మరీ తనదైన శైలిలో ‘ఎగ్జిట్ పోల్’ నిర్వహించారు బాబు. మహాకూటమికి 179 అసెంబ్లీ, 30 లోక్‌సభ స్థానాలు ఖాయువుంటూ ఆ వుుసుగులో తెగ ప్రచారం చేయించారు. కాంగ్రెస్‌కు 57 అసెంబ్లీ, 9 లోక్‌సభ సీట్లొస్తే కష్టవున్నారు. ఇలా ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్ర ప్రజలు వైఎస్ సంక్షేమ పాలనకే పట్టం కట్టారు. మహా కూటమిని మూకుమ్మడిగా తిరస్కరించారు. ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్‌కు అసెంబ్లీకి పోలైన ఓట్లలో 36.55 శాతం వస్తే, టీడీపీ నేతృత్వంలోని మహా కూటమికి 34.76 శాతమే వచ్చాయి. టీడీపీకి ఓటు బ్యాంకుకు 10 శాతం దాకా గండిపడింది. లోక్‌సభకు పోలైన ఓట్లలోనైతే కాంగ్రెస్‌కు 39 శాతం వస్తే టీడీపీకి కేవలం 24.93 శాతం దక్కాయి. ఆ పార్టీ చరిత్రలో ఇదే అత్యల్పం.

 

ధృతరాష్ట్ర కౌగిలి

 బాబుతో పొత్తు మొదటికే మోసమని మహా కూటమి ప్రయోగంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలకూ తెలిసొచ్చింది. 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం పదింటినే గెల్చుకుంది. 14 సీట్లలో పోటీచేసిన సీపీఐకి 4, 18 స్థానాల్లో బరిలో దిగిన సీపీఎంకైతే కేవలం ఒకే ఒక్క సీటు దక్కాయి.కేవలం బాబు మోసపూరిత వైఖరి వల్లే తీవ్రంగా నష్టపోయామంటూ టీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే ధ్వజమెత్తారు. బాబు మాత్రం ఆ పార్టీల పుట్టి ముంచిందే, వాటి కారణంగానే, ముఖ్యంగా టీఆర్‌ఎస్ వల్లే ఓడామంటూ టీడీపీ నేతలతో విమర్శలు చేయించారు. వాస్తవానికి టీడీపీ 91 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగలిగిందంటే అది టీఆర్‌ఎస్, వామపక్షాల పుణ్యమే. కేవలం వాటి ఓట్లు కలిసొచ్చినందువల్లే తెలంగాణలో 22, సీమాంధ్రలో 8 స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి.

 

 లేదంటే దానికి కనీసం వురో 30 అసెంబ్లీ సీట్లు తగ్గేవి. ఆ లెక్కన వుహా కూటమితో లాభపడింది టీడీపీ అయితే, నిండా మునిగింది. టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ! పైగా పొత్తు ఒప్పందాలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కింది. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన 45 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో పలు చోట్ల బీ ఫారాలిచ్చి మరీ అధికారికంగా అభ్యర్థులను పోటీకి దింపింది. టీఆర్‌ఎస్, వామపక్షాలు 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మెరుగైన ఫలితాలు సాధించాయి! సీపీఐ 12 స్థానాల్లో పోటీ చేస్తే ఆరింటిలో, సీపీఎం 14 స్థానాలకు గాను 9 చోట్ల, టీఆర్‌ఎస్ 54 స్థానాలకు గాను 26 చోట్ల గెలిచాయి. ఆ ఫలితాలను చూసే బాబు 2009లో ఆ మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని బొక్క బోర్లా పడ్డారు.

 

 ఛీ అన్న బీజేపీ కోసం తహతహ

 ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా కూటమి కట్టేందుకు బాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే, తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అసాధ్యమని ఆందోళన చెందుతున్నారు. లోక్‌సత్తాతో పాటు సినీనటుడు పవన్‌కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీని కూడా కలుపుకుంటానంటున్నారు! 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీజేపీతో పొత్తే కారణమని బాబు నిందించడం, మరెప్పుడూ ఆ పార్టీతో కలవబోమని ప్రకటించడం తెలిసిందే. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీస్తోందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీతో మరోసారి జత కట్టేందుకు తహతహలాడుతున్నారు.

 

 అందుకు ఆ పార్టీని ఎలాగైనా ఒప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కోటరీ నేతలతో రాయబారాలు నడుపుతున్నారు. గతానుభవాల దృష్ట్యా టీడీపీతో పొత్తు వద్దే వద్దని బీజేపీ రాష్ట్ర శాఖ కుండబద్దలు కొడుతున్నా, ఢిల్లీ స్థాయిలో కమలనాథులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని చెబుతున్నారు. పైగా సొంత పార్టీ నేతలపైనే పూర్తిగా నమ్మకం పెట్టుకోలేక నలిగిపోతున్న బాబు, ఎందుకైనా మంచిదని కాంగ్రెస్‌ను వీడుతున్న వారితో టీడీపీని నింపేశారు. ఇది టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. పైగా వచ్చిన వారందరికీ టికెట్లు ఖాయమంటూ బాబు భరోసా ఇస్తుండటంతో తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేషన్ల నాటికి అది మరింతగా రాజుకుని భగ్గమనే వాతావరణం టీడీపీలో చాలా స్థానాల్లో కన్పిస్తోంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top