ఒక పోలింగ్ కేంద్రంలో మావోయిస్టులు అమర్చిన సిలిండర్ బాంబులను ఎట్టకేలకు పోలీసులు నిర్వీర్యం చేశారు
ఒక పోలింగ్ కేంద్రంలో మావోయిస్టులు అమర్చిన సిలిండర్ బాంబులను ఎట్టకేలకు పోలీసులు నిర్వీర్యం చేశారు. బీహార్ లోని లఖీ సరాయ్ జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రంలోని మూడు బాంబులు ఉన్నట్టు గ్రామస్తులు కనుగొన్నారు. కానీ వీటిని శుక్రవారం మధ్యాహ్నానికి కానీ నిర్వీర్యం చేయడం కుదరలేదు.
దీంతో ఊరి మధ్యలో ఉన్న పోలింగ్ కేంద్రంలో పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులను ఉంచుకుని గ్రామస్తులు నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. అవి రాత్రి పేలి ఉంటే బారీ నష్టం సంభవించి ఉండేది. అయితే అదృష్టవశాత్తూ అవి పేలలేదు.
మావోయిస్టులు గురువారం ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు ఒక పోలింగ్ కేంద్రంలో ఈ బాంబులను అమర్చారు. ఈ కేంద్రంలో రెండు మూడు రోజుల క్రితం వరకూ భద్రతాదళాలు క్యాంపు ఏర్పాటు చేసుకున్నాయి. సరిగ్గా రెండు రోజుల క్రితమే వారు తమ తమ డ్యూటీలపై వెళ్లారు.