'ఆయనకు మెజార్టీ వస్తే..రాజకీయ సన్యాసం' | congress leader Anil open challenge to KCR | Sakshi
Sakshi News home page

'ఆయనకు మెజార్టీ వస్తే..రాజకీయ సన్యాసం'

May 10 2014 2:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ఆయనకు మెజార్టీ వస్తే..రాజకీయ సన్యాసం' - Sakshi

'ఆయనకు మెజార్టీ వస్తే..రాజకీయ సన్యాసం'

టీఆర్ఎస్ పార్టీని చీల్చడం పెద్ద పని కాదని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అన్నారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని చీల్చడం పెద్ద పని కాదని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అన్నారు. గతంలోనే పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి జారిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా గెలిచే ఎమ్మెల్యేలు జారిపోతారనే ఆందోళనతోనే కేసీఆర్ ఉన్నారని అనిల్ శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంలో యూపీఏకు మద్దతంటూ సోనియా, రాహుల్ పాట పాడుతున్నారని ఆయన విమర్శించారు.

టీఆర్ఎస్ 45 అసెంబ్లీ స్థానాలు మించి గెలవలేదని అనిల్ జోస్యం చెప్పారు. గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోవటం ఖాయమని ఆయన అన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా 50 వేల మెజార్టీతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ మెజార్టీ తగ్గితే  కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అనిల్ ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ఓ విధానమంటూ లేదని ఆయన విమర్శలు చేశారు.

కేసీఆర్, అనిల్, టీఆర్ఎస్, గజ్వేల్, కాంగ్రెస్, యూపీఏ, kcr, anil, trs, Gajwel, congress, upa

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement