టీడీపీ టికెట్ కోసం ‘చిరు’ యత్నం! | Chiranjeevi trying to get ticket from TDP for congress supporters | Sakshi
Sakshi News home page

టీడీపీ టికెట్ కోసం ‘చిరు’ యత్నం!

Mar 23 2014 3:02 AM | Updated on Aug 14 2018 4:46 PM

టీడీపీ టికెట్ కోసం ‘చిరు’ యత్నం! - Sakshi

టీడీపీ టికెట్ కోసం ‘చిరు’ యత్నం!

కీలక నేతలెవరైనా తవు సన్నిహితులకు, మద్దతుదారులకు సొంత పార్టీ నుంచి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేయడం సహజం.

గుసగుసలు:  కీలక నేతలెవరైనా తవు సన్నిహితులకు, మద్దతుదారులకు సొంత పార్టీ నుంచి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేయడం సహజం. కానీ ఒక పార్టీకి రాష్ట్రస్థాయిలో అతి ప్రధాన నేతల్లో ఒకరిగా ఉంటూ, అస్మదీయుులకు ప్రత్యర్థి పార్టీ టికెట్ కోసం లాబీయింగ్ చేసిన మెగా ఘనత బహుశ ఆ స్టార్ నేతకు మాత్రమే దక్కుతుందేమో! ప్రస్తుతం సీమాంధ్రలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వెనుకడుగు వేస్తుండటం తెలిసిందే. వారిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే ఒకరు సదరు ముఖ్య నేతను ఆశ్రరుుంచి, ‘సార్, మిమ్మల్నే నమ్ముకుని రాజకీయాల్లోకొచ్చా. ఏదో ఒకటి చేయండి’ అంటూ మొరపెట్టుకున్నాడట.
 
 కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ దక్కడం కూడా డౌటేనన్న వాదనతో ఏకీభవించిన ఆ నాయుకుడు, పోనీ వైఎస్సార్‌సీపీలో ట్రై చేయకపోయావా అంటూ వాకబు చేశారుట. ‘అక్కడ ఖాళీ లేదన్నారు సార్. ప్రస్తుతం టీడీపీలో ఉన్నోళ్లంతా మనోళ్లేగా సార్. కనీసం టీడీపీ టికెటైనా చూద్దురూ...’ అంటూ ఎమ్మెల్యే గారు వేడుకోవడంతో ఓ ‘చిరు’ ప్రయుత్నం చేసి చూద్దావుని చంద్రబాబుకు ఫోన్ కలిపారట. ‘బాబు గారూ...! ఈ ఎన్నికల్లో మీదీ మాదీ ఒకే పరిస్థితి కదా! నాకోసం మా ‘బాబు’ను చేర్చుకుని టికెటివ్వొచ్చుగా’ అంటూ సిఫార్సు చేశారట. మెగా ఫోన్ కాల్‌పై బాబు తెగ సంబరపడిపోవడమే గాక దానిదేముందంటూ ముక్తాయించారట! వాటే మెగా ఐడియా సర్‌జీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement