బాబు ‘మనసులో’మాట... | Chandrababu Naidu slips word from mouth as inner feeling | Sakshi
Sakshi News home page

బాబు ‘మనసులో’మాట...

Mar 27 2014 1:30 AM | Updated on Oct 8 2018 5:04 PM

బాబు ‘మనసులో’మాట... - Sakshi

బాబు ‘మనసులో’మాట...

మహబూబ్‌నగర్ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ‘మనసులో’ మాటను నోరుజారి బయటపెట్టేశారు.

గుసగుసలు: మహబూబ్‌నగర్ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ‘మనసులో’ మాటను నోరుజారి బయటపెట్టేశారు. ప్రసంగాన్ని ముగిస్తూ ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. తెలంగాణలో ఏర్పాటైన సభలో సమైక్య నినాదమేమిటని కొందరు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడీ నినాదమేమిటని మరికొందరు తెలుగు తమ్ముళ్లు తెగ మథనపడసాగారు. ఇంత చిన్న విషయానికే అంతగా తలలు వేడెక్కించుకోవాలా? అంటూ అటుగా వచ్చిన సీని యర్ నేత ఒకరు వారి సందేహాలను నివృ త్తి చేశారట. ‘ఇటీవలి కాలంలో మనం చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాం.

 

అయితే, మనల్ని నమ్మి ఎవరూ పొత్తు కోసం ముందుకు రావడం లేదు. కొద్దిరోజులుగా బాబుగారు ఇంట్లో పొత్తులపైనే చర్చలు జరుపుతున్నారు కదా..! ఆ చర్చల్లోని ప్రతిపాదనే మనసు లో ఉండిపోయినట్లుంది. అందుకే జై సమైక్యాంధ్ర అన్నార’ని సెలవిచ్చారట. అదేం టంటూ తమ్ముళ్లు అవాక్కయితే, ‘కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు కదా. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదన వచ్చిం ది. బహుశ అదే మనసులో ఉండిపోయి అలా అని ఉంటారు’ అని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement