వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మ హామీ ఇచ్చారు.
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మ హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ 104 ఉద్యోగులు సోమవారం విజయమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు షర్మిల ఈరోజు నగరంలో నిర్వహించనున్నారు. భీమిలి నియోజకవర్గంలో రోడ్షో, సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తారు.
* ఉదయం 9 గంటలకు మధువారడ (స్వాతినగర్)లో రోడ్డు షో, సభ
* మధ్యాహ్నం ఒంటిగంటకు ఫోర్ పాయింట్స్ షెరటాన్లో పాస్టర్లతో సమావేశం
* మధ్యాహ్నం 3 గంటలకు ఆరిలోవ రెండో వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద సభ
* సాయంత్రం 4 గంటలకు డాల్ఫిన్ హోటల్ జంక్షన్ వద్ద సభ
* సాయంత్రం 4.40కు వైఎస్ఆర్ సీపీ మహిళా సెల్ సమావేశం