ఐఓసీఎల్‌లో 362 అప్రెంటీస్‌ పోస్టులు


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌).. దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలోని మార్కెటింగ్‌ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్‌ అప్రెంటీస్‌షిప్‌ శిక్షణతోపాటు పైప్‌లైన్స్‌ డివిజన్‌లో టెక్నీషియన్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ప్రకటన జారీ చేసింది.రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్టర్న్‌ రీజియన్‌–95, సదరన్‌ రీజియన్‌–89, వెస్టర్న్‌ రీజియన్‌–110, పైప్‌లైన్స్‌ డివిజన్‌–68.

సై్టపెండ్‌: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు రూ.7530; ట్రేడ్‌ అప్రెంటీస్‌కు రూ.6970.

విద్యార్హత: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా; ట్రేడ్‌ అప్రెంటీస్‌(ల్యాబ్‌ అసిస్టెంట్‌)కు బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్,

కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ).గమనిక: పైన పేర్కొన్న కోర్సుల్లో పాసై 2016 డిసెంబర్‌ 1 నాటికి మూడేళ్లు దాటకూడదు. గతంలో శిక్షణ పొందినవారు/ఏడాది ఉద్యోగానుభవం గల వారు అనర్హులు.  

వయసు: మార్కెటింగ్‌ డివిజన్‌లోని పోస్టులకు 2016 డిసెంబర్‌ 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు ఉంటుంది. పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు వయసును లెక్కించేందుకు 2017 జనవరి 14ను కటాఫ్‌ డేట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.  శిక్షణ వ్యవధి: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌కు 12 నెలలు; ట్రేడ్‌ అప్రెంటీస్‌కు 18 నెలలు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ్యలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వూ్యకి 15 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రతి అభ్యర్థి ఈ రెండు దశల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు జనరల్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం, ఇతరులు 35 శాతం మార్కులు పొందాలి.  రాత పరీక్ష:

1. మార్కెటింగ్‌ డివిజన్‌లోని అప్రెంటీస్‌ పోస్టులకు: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటిని సంబంధిత డిసిప్లెయిన్‌; జీకే/అవేర్‌నెస్, రీజనింగ్‌/లాజికల్‌ ఎబిలిటీ సబ్జెక్టుల నుంచి రూపొందిస్తారు.2. పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో 85 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఇందులో 60 ప్రశ్నలు సంబంధిత డిసిప్లెయిన్‌ నుంచి; మిగిలిన 25 ప్రశ్నలు జనరల్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిష్‌/హిందీ, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, జీకే నుంచి ఇస్తారు.ఇంటర్వూ్య: పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ‘ఒక పోస్టుకు ముగ్గురు’ చొప్పున ఇంటర్వూ్యకి పిలుస్తారు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.ముఖ్య తేదీలు:

1. మార్కెటింగ్‌ డివిజన్‌లోని పోస్టులకు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభ తేది: ఫిబ్రవరి 1; చివరి తేది: ఫిబ్రవరి 13.

2. పైప్‌లైన్‌ డివిజన్‌లోని పోస్టులకు: ఆన్‌లైన్‌ అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 13; రాత పరీక్ష తేది: మార్చి 5; ఇంటర్వూ్య తేదీలు: మార్చి 6, 7.   

వెబ్‌సైట్‌: www.iocl.com

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top