
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 61క్రెడిట్ ఆఫీసర్లు, రిస్క్ మేనేజర్లు
క్రెడిట్ ఆఫీసర్లు (ఎంఎంజీ స్కేల్-2) పోస్టులు: 38 (జనరల్-19, ఓబీసీ-10, ఎస్టీ-3, ఎస్సీ-6)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్లు, రిస్క్ మేనేజర్
పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
క్రెడిట్ ఆఫీసర్లు (ఎంఎంజీ స్కేల్-2)
పోస్టులు: 38 (జనరల్-19, ఓబీసీ-10, ఎస్టీ-3, ఎస్సీ-6)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫుల్‌టైమ్ ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత లేదా 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు పీజీడీబీఎం (ఫైనాన్స్) ఉత్తీర్ణత లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఫైనల్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: సెప్టెంబర్ 30, 2016 నాటికి 20 - 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.31,705 - రూ. 45,950
రిస్క్ మేనేజర్లు (ఎంఎంజీ స్కేల్-2)
పోస్టులు: 23 (జనరల్ - 12, ఓబీసీ - 6, ఎస్టీ-2, ఎస్సీ - 3)
అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్/ఎంసీఏ విత్ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (మ్యాథ్స్) లేదా 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్) లేదా 60 శాతం మార్కులతో ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత.
ఎఫ్‌ఆర్‌ఎం/సీఎఫ్‌ఏ/డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్/ఎస్‌ఏఎస్/ఎస్‌పీఎస్‌ఎస్/ ఒరాకిల్/డీబీ2 ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
బ్యాంకింగ్/ రిస్క్ మేనేజ్‌మెంట్/క్రెడిట్/ట్రెజరీ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
పే స్కేల్: రూ.31,705 - రూ. 45,950
పై రెండు పోస్టులకు కంప్యూటర్ ఆపరేటింగ్, కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: 60 నిమిషాల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు. పరీక్షలో క్రెడిట్ లేదా రిస్క్ (50 ప్రశ్నలు, 50 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు, 20 మార్కులు), బ్యాంకింగ్, ప్రజెంట్ ఎకనామిక్ సినారియో అండ్ జనరల్ అవేర్‌నెస్ (30 ప్రశ్నలు, 30 మార్కులు) ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. ప్రశ్న కింద ఐదు ఆప్షన్స్ ఇస్తారు. ప్రశ్నపత్రం హిందీ లేదా ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది.
నెగెటివ్ మార్కులు: ఆన్‌లైన్ పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మార్కుల కోత విధిస్తారు.
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుముతోపాటు రూ.50 ఇంటిమేషన్ ఛార్జీలు నెట్‌బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్స్/డెబిట్‌కార్డ్స్/మొబైల్ వాలెట్స్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.50 ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 14, 2016
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2016
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: అక్టోబర్ 20 నుంచి
ఆన్‌లైన్ పరీక్ష: నవంబర్ 4, 2016
వెబ్‌సైట్: www.centralbankofindia.co.in