మీడియాకు సంకెళ్లా..? | ysrcp dharna against tdp government | Sakshi
Sakshi News home page

మీడియాకు సంకెళ్లా..?

Nov 9 2016 12:31 AM | Updated on Mar 28 2019 6:27 PM

మీడియాకు సంకెళ్లా..? - Sakshi

మీడియాకు సంకెళ్లా..?

నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న సాక్షి చానల్‌ను హిందూపురం పట్టణంలో నిలిపివేయడం చట్ట విరుద్ధమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున విమర్శించారు.

– 'సాక్షి' ప్రసారాలు నిలిపివేయడం చట్టవిరుద్ధం
హిందూపురం అర్బన్‌ : నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న సాక్షి చానల్‌ను హిందూపురం పట్టణంలో నిలిపివేయడం చట్ట విరుద్ధమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున విమర్శించారు. మంగళవారం వివిధ వార్డులకు చెందిన సాక్షి అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ నాయకత్వంలో స్థానిక డీఎల్‌ రోడ్డులోని సిటీకేబుల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిటీకేబుల్‌  నిర్వాహకులు రాజకీయ ఒత్తిళ్లతో సాక్షి ప్రసారాలు రాకుండా చేయడం దారుణమన్నారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించకుంటే వినియోగదారుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏ బ్లాక్‌ కన్వీనర్‌ ఇర్షాద్, పట్టణ మహిళా కన్వీనర్‌ నాగమణి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, రజనీ, జబీవుల్లా, ఎస్సీ సెల్‌ శ్రీనా, రఘు, విద్యార్థి సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రియాజ్, రమేష్, నర్సిరెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement