ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్వవహారంలో బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు హామీ ఇచ్చారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్వవహారంలో బాధితులకు న్యాయం చేస్తామని కమిషనరేట్ శాంతి భద్రతల విభాగం డీసీపీ లేళ్ల కాళిదాసు వేంకట రంగారావు హామీ ఇచ్చారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన విజయవాడలో పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదులకు 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఇప్పటివరకు కాల్మనీ సెక్స్రాకెట్పై 400 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అధిక వడ్డీతో మోసపోయామని ఎక్కువమంది ఫిర్యాదులు చేశారని ఆయన తెలిపారు. ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని డీసీపీ కాళిదాసు చెప్పారు.