చంద్రబాబుకు చేదు అనుభవం | sour experience to CM chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చేదు అనుభవం

Jan 26 2016 6:38 PM | Updated on Jul 28 2018 3:23 PM

చంద్రబాబుకు చేదు అనుభవం - Sakshi

చంద్రబాబుకు చేదు అనుభవం

రాష్ట్రస్థాయి పుష్ప, ఫల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది.

విజయవాడ: రాష్ట్రస్థాయి పుష్ప, ఫల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ఎదుట కాల్ మనీ బాధితులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలే కాల్ మనీ వ్యాపారులుగా మారి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బంధువులు నుంచి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.

బాధితుల ఆందోళనతో చంద్రబాబు అవాక్కయ్యారు. సభలో అల్లరి చేయొద్దంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలవాలని బాధితులకు సూచించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాల్ మనీ బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. చంద్రబాబు ఎదుట నినాదాలు చేసిన శివరామ్ అనే యువకుడిని సీఎం వెళ్లిపోయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement