17న విరాట్‌ విశ్వకర్మ జయంత్యుత్సవాలు | viswakarma birty anniversary on 17th | Sakshi
Sakshi News home page

17న విరాట్‌ విశ్వకర్మ జయంత్యుత్సవాలు

Sep 14 2016 6:51 PM | Updated on Sep 4 2017 1:29 PM

17న విరాట్‌ విశ్వకర్మ జయంత్యుత్సవాలు

17న విరాట్‌ విశ్వకర్మ జయంత్యుత్సవాలు

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ నెల 17న విరాట్‌ విశ్వకర్మ జయంత్యుత్సవాలను స్థానిక జింఖానా మైదానంలో నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్‌ జె. కూర్మాచారి తెలిపారు. గవర్నర్‌పేటలోని బెజవాడ జ్యూయలరీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారని చెప్పారు.

విజయవాడ (గాంధీనగర్‌) : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ నెల 17న విరాట్‌ విశ్వకర్మ జయంత్యుత్సవాలను స్థానిక జింఖానా మైదానంలో నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్‌ జె. కూర్మాచారి తెలిపారు. గవర్నర్‌పేటలోని బెజవాడ జ్యూయలరీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా 108 దంపతులచే విశ్వకర్మ యజ్ఞం నిర్వహిస్తామని తెలిపారు. విశ్వకర్మ సేవా పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. ఉత్సవ కమిటీ వ్యవస్థాపకుడు కర్రి వేణుమాధవ్‌ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో 13జిల్లాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం విశ్వకర్మ జయంత్యుత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు అండలూరి ఏకాంబరరావు, పొన్నాడ ఈశ్వరాచారి, పాండురంగాచారి, రావుట్ల వెంకటచారి, చిప్పాడ చందు, చిలుగోటి అంజిబాబు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement