పట్టణంలోని ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని భగవంతం వాడ వద్ద గల రైల్వే ట్రాకు వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ దివాకర్ కథనం ప్రకారం...
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
Aug 22 2016 11:57 PM | Updated on Nov 6 2018 8:04 PM
మంచిర్యాల టౌన్ : పట్టణంలోని ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని భగవంతం వాడ వద్ద గల రైల్వే ట్రాకు వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ దివాకర్ కథనం ప్రకారం... మంచిర్యాల నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్‌సిటీ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి తల నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టరాకుండా ఉంది పరిస్థితి. మతుడి షర్టు కాలర్‌పై ‘సందీప్ టైలర్స్, గోదావరిఖని’ అని రాసి ఉంది. అతడి ఒంటిపై చాక్లెట్ కలర్ ప్యాంటు, తెలుపు రంగు షర్టుపై బ్లూ కలర్ సన్నటి గీతలు, పూత బనియన్ ఉన్నాయి. ఆనవాళ్లను గుర్తించిన 9440700039, 9866337535 నంబర్లలో సంప్రదించాలని హెడ్‌కానిస్టేబుల్ కోరారు.
Advertisement
Advertisement