రోడ్డుపై మొండెం లేని తల | Sakshi
Sakshi News home page

రోడ్డుపై మొండెం లేని తల

Published Sat, Jan 2 2016 10:12 AM

రోడ్డుపై మొండెం లేని తల - Sakshi

రోడ్డుపై మొండెం లేని తల పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన విశాఖజిల్లా యలమంచిలి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక అల్లూరి సీతారామరాజు కాలనీ సమీపంలోని ప్రధాన రహదారిపై తల భాగం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. యలమంచిలి రైల్వే స్టేషన సమీపంలోని పెద్దపల్లి రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు ఉండటంతో.. పాటు కేవలం మొండెం మాత్రమే ఉండటాన్ని గమనించిన పోలీసులు ఈ తల ఆ వ్యక్తిదే అయి ఉంటుందని భావిస్తున్నారు.


 

Advertisement
Advertisement