ఇద్దరు దొంగల అరెస్ట్ | Two wheeler thieves arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగల అరెస్ట్

Jul 22 2016 5:07 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఇద్దరు ద్విచక్రవాహనాల దొంగలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇద్దరు ద్విచక్రవాహనాల దొంగలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ ఇన్స్‌పెక్టర్ కె.సత్యనారాయణ, అదనపు ఇన్స్‌పెక్టర్ ఆర్.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మహాబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం ఇనుముల్‌నర్వ గ్రామానికి చెందిన క్రిష్ణయ్య కుమారుడు కుక్కోల్ల భరత్ (19), అదే ప్రాంతానికి చెందిన బలరామ్ కుమారుడు బుక్క శివప్రసాద్ (23) చెడు అలవాట్లకు బానిసలై ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారు.

 

ఈ నెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి చెందిన గుర్రపల్లి శ్రీనివాస్ తన ఫ్యాషన్ ప్లస్ ద్వీచక్రవాహనాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ చేసి ఫ్రెండ్స్‌ను రైల్వే స్టేషన్‌లో వదిలి పెట్టి బయటకు వచ్చాడు. పార్కింగ్ చేసి ద్విచక్రవాహనం కనిపించకుండా పోయింది. తెలిసిన ప్రాంతాల్లో ఎంత వెదికినా కనిపించలేదు. దీంతో ఈ నెల 21వ తేదీన కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. క్రైంబ్రాంచ్ సిబ్బంది రాంకోఠిలో ద్విచక్రవాహనాల వద్ద తనిఖీలు చేస్తుండగా భరత్, శివప్రసాద్‌లు అనుమాన స్పధంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

 

వారు ద్విచక్రవాహనాలను దొంగిలించనట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ద్విచక్రవాహన దొంగలిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ డిఎస్‌ఐ బి.జగదీశ్వర్‌రావు, ఎస్‌ఐ వి.జయన్నలతో క్రైం పార్టీ సిబ్బంది కేసును త్వరితగతిన చేధించడంతో వారిని ఇన్స్‌పెక్టర్ కె.సత్యనారాయణ అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement