ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | Two died Road accident in West Godavari district | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Nov 25 2016 11:08 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పట్టణ శివారున నాలుగో రోడ్డు వంతెన జంక్షన్ వద్ద రాష్ట్ర రహాదారిపై దొమ్మేరు వైపు నుంచి వస్తున్న మోటారు సైకిల్‌ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో

పశ్చిమ గోదావరి జిల్లా : పట్టణ శివారున  నాలుగో రోడ్డు వంతెన జంక్షన్ వద్ద రాష్ట్ర రహాదారిపై దొమ్మేరు వైపు నుంచి వస్తున్న మోటారు సైకిల్‌ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.పిమ్మి శివన్నారాయణ(38) సంఘటన స్ధలంలోనే మృతి చెందగా తీవ్రగాయాలపాలైన సాధనాల సర్వేశ్వరరావు(36) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.విశాఖపట్నం జిల్లా భీముని పట్నంలోని తోటవీధికి చెందిన శివన్నారాయణ రెండేళ్ల నుంచి కుటుంబ సమేతంగా దొమ్మేరులో నివాసం ఉంటున్నారు.తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 
తాపీ మేస్త్రీ అయిన సర్వేశ్వర రావు తో కలిసి తాపీ పనులు చేసుకుంటున్నారు.శుక్రవారం భవన నిర్మాణానికి అవసరమైన సామాగ్రి కొనుగోలు నిమిత్తం శివన్నారాయణ మోటారు సైకిల్‌పై కొవ్వూరు బయల్ధేరారు. కొవ్వూరు నాలుగో రోడ్డు వంతెన(గామన్ బ్రిడ్జి) జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈప్రమాదం సంభవించింది.లారీ ఢీకొట్టిన దాటిని మోటారుసైకిల్ ముందు భాగం తునాతునలైంది. శివన్నారాయణ తలరెండు భాగాలుగా విడిపోయి మెదడు బయట పడడంతో సంఘటనా స్ధలంలోనే ప్రాణాలు వదలారు.తీవ్ర గాయాలైన సర్వేశ్వరరావును 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం తరలించారు.ఈ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే సర్వేశ్వరరావు కుడా ప్రాణాలు కొల్పోయారు.శివన్నారాయణ భార్య ఈశ్వరీ తాతయ్య ఆర్టీసీ మెకానిక్‌గా పనిచేసే మహ్మాద్ సర్ధార్ స్వగ్రామమైన దొమ్మేరులో ఉంటున్నారు.
 
రెండు నెలల కిత్రమే శివన్నారాయణ గోపాలపురానికి అత్త గుల్లపల్లి లక్ష్మి పేరుతో కొత్త మోటారు సైకిల్ కొనుగోలు చేశారు. ఇంత లోనే ప్రమాదపాలయ్యారని మృతుడి భార్య బోరున విలపించింది. శివ న్నారాయణకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సర్వేశ్వరరావు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.పట్టణ ఎసై్స డి.గంగాభవానీ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతుడు శివన్నా రాయణ భార్య ఈశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై్స తెలిపారు.శివన్నారాయణ మృతదేహాన్ని కొవ్వూరు మార్చురీ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement