రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దపాలో రుణమాఫీ చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో 50శాతం కూడా చేయలేదన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బోథ్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
టీఆర్‌ఎస్ రైతు వ్యతిరేకి
Aug 7 2016 11:46 PM | Updated on Mar 18 2019 9:02 PM
బజార్‌హత్నూర్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దపాలో రుణమాఫీ చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో 50శాతం కూడా చేయలేదన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బోథ్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలవకపోయిన కార్యకర్తలు నిరుత్సాహపడలేద, ఎవరి ప్రలోభాలకు లొంగలేదన్నారు. జిల్లా నాయకులు కొంమ్రం కోటేశ్, మల్లేపూల నర్సయ్య, మాజీ ఆత్మచైర్మన్ గొర్ల రాజు, మల్లేశ్, ఇర్ల శివుడు, మాజీ ఎంపీటీసీలు కానిందే ఉద్దవ్, జల్కే పాండురంగ్,నాయకులు, చట్ల గజ్జయ్య, ఎస్‌ఎంసీ , చట్ల నగేశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement