ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి | Tractor hit the person killed | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

Nov 4 2016 11:41 PM | Updated on Sep 4 2017 7:11 PM

కర్నూలు - నందికొట్కూరు రహదారిలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

కల్లూరు (రూరల్‌):   కర్నూలు - నందికొట్కూరు రహదారిలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా నార్‌పల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డి కుమారుడు పాటిల్‌ రంగారెడ్డి (31) క్లోరోఫిల్‌ ఆర్గానిక్‌ కంపెనీలో మూడేళ్లుగా ట్రైనీగా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సహ ఉద్యోగి ముచ్చుమర్రికి చెందిన రాజేష్‌ వేర్వేరు బైక్‌లపై నందికొట్కూరుకు బయలుదేరారు. పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వేగంగా ఢీకొనడంతో రంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాలే వస్తున్న రాజేష్‌ తన స్నేహితుడి మృతదేహాన్ని గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతుడికి భార్య యోగేశ్వరి, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement