పట్టణ సమీపంలోని స్థానిక కలచట్ల బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు.
దారి దోపిడీ
Nov 4 2016 11:42 PM | Updated on Aug 30 2018 5:27 PM
- వ్యక్తిని చితకబాది రూ. లక్షతో ఉడాయించిన దుండగులు
ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక కలచట్ల బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. మండల పరిధిలోని ఎస్. రంగాపురం గ్రామానికి చెందిన శివ సొంత ట్రాక్టర్‌ను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ప్యాపిలికి వచ్చిన అతను వేరే వ్యక్తి వద్ద రూ. లక్ష తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కలచట్ల బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను అటకాయించారు. శివను పక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి చితకబాది వద్ద ఉన్న లక్ష రూపాయలను తీసుకుని ఉడాయించారు. కొద్ది సేపఽటికి తేరుకుని అతను కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకుని అతడిని ప్యాపిలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement