ఉపాధ్యాయులపై పని ఒత్తిడి, రికార్డు వర్క్ భారం తగ్గించాలని కోరుతూ బుధవారం నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్టు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కె.వరప్రసాద్, జిల్లా కార్యదర్శులు అప్పలనాయుడు, కేవీ రమణమూర్తి, పి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనలు
Aug 16 2016 8:49 PM | Updated on Sep 4 2017 9:31 AM
పిఠాపురం టౌన్ :
ఉపాధ్యాయులపై పని ఒత్తిడి, రికార్డు వర్క్ భారం తగ్గించాలని కోరుతూ బుధవారం నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్టు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కె.వరప్రసాద్, జిల్లా కార్యదర్శులు అప్పలనాయుడు, కేవీ రమణమూర్తి, పి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రదర్శనల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పిఠాపురం, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం విద్యా డివిజన్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు ఆ¯Œæలైన్ పరీక్షను టీఎన్‌ఐటీని ఉపసంహరించుకోవాలని, సీసీఈ రికార్డ్ వర్క్ భారం తగ్గించాలని, ప్రాజెక్టు వర్కులు, ప్రయోగాల విషయంలో క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, ఆన్‌లైన్ వర్క్ భారాన్ని ఉపాధ్యాయులపై మోపరాదని, ప్రతి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ లాబ్, ఫ్యాకల్టీనివ్వాలని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, పర్యవేక్షణాధికారులకు సమాంతరంగా ఏర్పాటు చేస్తున్న మానిటరింగ్ టీమ్స్‌ను రద్దు చేయాలని, పదో తరగతి సిలబస్‌ను ముందుగానే పూర్తి చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
Advertisement
Advertisement