కూలి డబ్బులు ఇవ్వమని అడగడానికి వె ళ్లిన వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
కూలి డబ్బులు ఇవ్వమని అడగడానికి వె ళ్లిన వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడ రమేష్(30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈక్రమంలో గత మూడు రోజులుగా అదే గ్రామంలోని బూక్య ఇంట్లో కూలి పనికి వెళ్తున్నాడు. గురువారం రాత్రి కూలి డబ్బులు అడగడానికి బూక్య ఇంటకి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బూక్య పెద్ద కుమారుడు బావుసింగ్ ‘డబ్బులు లేవ్.. గిబ్బులు లేవ్.. వెళ్లు’ అంటూ అతని పై దాడి చేశాడు. కర్రతో తీవ్రంగా కొట్టి బయట పడేశాడు. విషయం తెలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.