మార్కెట్ల అనుసంధానంలో రాష్ట్రం ప్రథమం
మిర్యాలగూడ రూరల్ : దేశంలోని వ్యవసాయ మార్కెట్లన్నింటిని ఒకే గొడుగు కిందికి తెస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విధానం అమలులో తెలంగాణ రాష్ట్ర మార్కెట్ ప్రథమ స్థానంలో ఉందని వ్యవ్యసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకులు(జేడీఓ) రామన్నగారి లక్ష్మణుడు తెలిపారు.
మిర్యాలగూడ రూరల్ : దేశంలోని వ్యవసాయ మార్కెట్లన్నింటిని ఒకే గొడుగు కిందికి తెస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విధానం అమలులో తెలంగాణ రాష్ట్ర మార్కెట్ ప్రథమ స్థానంలో ఉందని వ్యవ్యసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకులు(జేడీఓ) రామన్నగారి లక్ష్మణుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విధానం ద్వారా ట్రేడర్(కొనుగోలుదారు) లైసెన్స్(ఒకే లైసెన్స్ విధానం) తీసుకొని దేశంలో ఏమార్కెట్‌లోనైనా «ధాన్యాన్ని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఈ విధానం అమలు చేసేందుకు ప్రథమంగా మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ, తిరుమలగిరి, నల్లగొండ మార్కెట్లలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిలాల్లోని వ్యవసాయ మార్కెట్లలో హరితహారంలో మార్కెట్‌వర్గాలు జిల్లాకు లక్ష మొక్కలు ఈనెల 12 నాటికి నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు. ఇప్పటి వరకు నల్లగొండ జిలాలోని మార్కెట్లలో 30,191మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. మిగిలిన మొక్కలను యుద్ధప్రాతిపదిన నాటేందుకు సంబంధిత అధికారులపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఏడీఎం అలీమ్, గ్రేడ్ వన్ మార్కెట్ సెక్రటరీ అనంతయ్య, గిరిప్రసాద్, వెంకటేశ్వర్‌రెడ్డి , శ్రీనివాస్, శంషీర్ తదితరులు పాల్గొన్నారు.