ఆటో ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు | students injured of auto accident | Sakshi
Sakshi News home page

ఆటో ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

Aug 4 2017 9:42 PM | Updated on Nov 9 2018 4:44 PM

ఆటో ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు - Sakshi

ఆటో ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

చిగిచెర్ల గ్రామం నుంచి ధర్మవరం వస్తున్న ఆటో శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

ధర్మవరం రూరల్‌: చిగిచెర్ల గ్రామం నుంచి ధర్మవరం వస్తున్న ఆటో శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు  విద్యార్థులు  గాయపడ్డారు. వివరాలలోకి వెళ్లితే చిగిచెర్ల నుంచి ఉదయం 8 గంటలకు ఆటో బయలు దేరింది. డ్రైవర్‌ పాటలు వింటూ ఆటోను వేగంగా నడుపుతున్నాడు. గ్రామం దాటి కొద్ది దూరం రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి ఆటో బోల్తాపడింది. స్వాతి, నందిని, శ్రీలక్ష్మి, విజయ్, అంజాన్, ఉమాపతి, బాషా అనే విద్యార్థులు గాయపడ్డారు. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా పట్టణంలోని సీతారామయ్య, శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు వచ్చేందుకు ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement