విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి | student died with electrick shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి

Dec 31 2016 10:27 PM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి - Sakshi

విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి

విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఓర్వకల్లులో చోటు చేసుకుంది.

ఓర్వకల్లు : విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఓర్వకల్లులో చోటు చేసుకుంది. వివరాలు ఇవీ.. గుట్టపాడు గ్రామానికి చెందిన గొల్లెపోగు నాగశేషులు, బాలరంగమ్మ దంపతులకు కుమారుడు విజయ్‌కుమార్‌ (21)కర్నూలులో డిగ్రీ చదువుతున్నాడు.  తండ్రి నాగశేషులు అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ పోషణ నిమిత్తం.. బేల్దార్‌ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓర్వకల్లుకు చెందిన బండారు సంజన్న ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా శుక్రవారం సాయంత్రం నిర్మాణం చేపడుతున్న ఇంటిపై ఉన్న విద్యుత్‌ తీగలకు ప్రమాదవశాత్తు తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో కోలుకోలేక శనివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు విద్యుత్‌ శాఖ ఏడీ రమేష్, ఏఈ శ్రావణకుమార్‌రెడ్డితో పాటు సిబ్బందిని బాద్యులను చేస్తూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement