రాజవొమ్మంగికి చెందిన అహ్మద్ (16) అనే విద్యార్థి బుధవారం విశాఖ జిల్లా కేడీపేట సమీపంలోని గాదిగుమ్మి జలపాతంలోకి జారిపడి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలిసిన రాజవొమ్మంగి ఎస్‌ఐ
జలపాతంలో పడి విద్యార్థి దుర్మరణం
Jan 18 2017 10:11 PM | Updated on Nov 9 2018 5:02 PM
రాజవొమ్మంగి (రంపచోడవరం) :
రాజవొమ్మంగికి చెందిన అహ్మద్ (16) అనే విద్యార్థి బుధవారం విశాఖ జిల్లా కేడీపేట సమీపంలోని గాదిగుమ్మి జలపాతంలోకి జారిపడి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలిసిన రాజవొమ్మంగి ఎస్‌ఐ రవికుమార్ ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. అహ్మద్ విశాఖపట్నంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొంతమంది బంధువులతో కలసి అతడు గాదిగుమ్మి జలపాతం వద్దకు పిక్‌నిక్‌కు వెళ్లాడు. ఎత్తుగా ఉన్న జలపాతం వద్ద పైనుంచి జారి పడి మృతి చెందాడని అతడి బంధువులు తెలిపారు. అందరితోనూ సరదాగా ఉండే అహ్మద్ మృతితో రాజవొమ్మంగిలో విషాదం అలముకొంది. తల్లి బషీరా, తండ్రి హైదర్, ఇతర కుటుంబ సభ్యుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఈ సంఘటనపై విశాఖ జిల్లా కేడీపేట పోలీసులతో పాటు తామూ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవికుమార్ విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement