వంతెన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.
మఠంపల్లి (నల్లగొండ): వంతెన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణ పనుల్లో శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం మర్లపాడు గ్రామానికి చెందిన ఎం.సింహాచలం (40) పనిచేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం పిల్లర్‌పైకి ఎక్కి పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సింహాచలానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా కలిసి వంతెన నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.