ముహూర్తం ముంచుకొస్తోంది | siddipeta collectorate should ready on 5th | Sakshi
Sakshi News home page

ముహూర్తం ముంచుకొస్తోంది

Oct 1 2016 10:01 PM | Updated on Sep 4 2017 3:48 PM

సమీక్షకు హజరైన అధికారులు

సమీక్షకు హజరైన అధికారులు

దసరా ముందుకోస్తుంది.. రాష్ర్ట ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

5వ తేదీలోగా సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో బోర్డులు వెలియాలి
అధికారులతో జేసీ సమీక్ష.. శాఖలవారీగా నివేదికలు సిద్ధం
ఉద్యోగులు, వసతులపై ఆరా

సిద్దిపేట జోన్‌: దసరా ముందుకోస్తుంది.. రాష్ర్ట ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు ప్రక్రియలో పాల్గొననున్న తరుణంలో జిల్లా అధికార యంత్రాంగం నూతన జిల్లా పరిణామాలపై కసరత్తును వేగవంతం చేస్తుంది.

సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్‌ తాత్కలిక భవనం ఒక వైపు వేగంగా నిర్మాణ దిశగా ముందుకు సాగడం మరోవైపు ఆయా ప్రభుత్వ శాఖల స్థితిగతులపై అధికారులు అడుగు ముందుకు వేస్తున్నారు. అందులో బాగంగా శనివారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి జిల్లా వివిధ శాఖ అధికారులచే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల వారిగా వివరాలను సేకరించారు.

ప్రభుత్వ అదేశాల మేరకు  నివేదికలు రూపొందించి ప్రోఫార్మాకు అనుగుణంగా కార్యాలయం , అధికారులు , సిబ్బంది, గదులు, కనీస వసతులు , పర్నిచర్‌ తదితర అంశాలతో జేసీ జిల్లా అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. అదే విధంగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియపై చర్చించారు. ముఖ్యంగా కీలక శాఖలను బలోపేతం చేసే దిశగా సమీక్షలో చర్చా కొనసాగింది.

ఈ నెల 5న తప్పనిసరిగా ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు బోర్డులు సిద్దం చేసుకోవాలని జేసీ సూచించారు. అదే విధంగా  ఉద్యోగులు వివరాలు, గదుల వివరాలు అవసరమయ్యే పర్నిచర్‌ తదితర  ఏర్పాట్లను వేగవంతం చేసుకోవాలని సూచించారు.ఈ సమీక్షలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement