వేతనాలివ్వకుంటే ఉద్యమం | salarys nill..financial problems employees | Sakshi
Sakshi News home page

వేతనాలివ్వకుంటే ఉద్యమం

Jan 6 2017 10:10 PM | Updated on Oct 2 2018 5:51 PM

వేతనాలివ్వకుంటే పోరుబాట పట్టక తప్పదని శ్రీ సత్యసాయి డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు మెయింటెనె¯Œ్స వర్కర్స్‌ యూనియ¯ŒS (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు జాజుల వరప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి వెంకట రామసత్య వరప్రసాద్‌లు

  • జీతాల్లేక అలమటిస్తున్న శ్రీసత్యసాయి వాటర్‌ ప్రాజెక్ట్‌ సిబ్బంది
  • మూడు నెలలుగా ఇక్కట్లు
  • ఇలాగైతే నీటి సరఫరా నిలిపివేస్తామంటున్న ఉద్యోగులు
  • పురుషోత్తపట్నం (సీతానగరం) :
    వేతనాలివ్వకుంటే పోరుబాట పట్టక తప్పదని శ్రీ సత్యసాయి డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు మెయింటెనె¯Œ్స వర్కర్స్‌ యూనియ¯ŒS (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు జాజుల వరప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి వెంకట రామసత్య వరప్రసాద్‌లు హెచ్చరించారు. శుక్రవారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పురుషోత్తపట్నంలోని శ్రీ సత్యసాయి వాటర్‌ ప్రాజెక్ట్‌ నుంచి సీతానగరం, కోరుకొండ, గోకవరం, దేవీపట్నం, రాజానగరం మండలంలోని 74 గ్రామాలకు; కుట్రవాడ ప్రాజెక్ట్‌ నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల మండలాల్లోని 125 గ్రామాలకు; సీలేరు ప్రాజెక్ట్‌ నుంచి 17 గ్రామాలకు; పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని ప్రాజెక్ట్‌ నుంచి పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తదితర 17 మండలాల్లోని 242 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 120 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 152 మంది ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నామని చెప్పారు. లక్షలాది మందికి తాగునీరు అందించడంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వడ్డీలకు అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలాగైతే తాము ఏవిధంగా బతకాలని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి ఇవ్వాల్సిన జీతాలను తక్షణమే అందించాలని, లేకుంటే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. తాము ఉద్యమబాట పడితే ఉభయ గోదావరి జిల్లాల్లోని 458 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తక్షణం దృష్టి సారించి, ఎప్పటిలాగే ఎల్‌ అండ్‌ టీ ద్వారా జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement