సాక్షి మెగా ఆటోషో అదరహో | sakshi mega autoshow | Sakshi
Sakshi News home page

సాక్షి మెగా ఆటోషో అదరహో

Jul 24 2016 11:42 PM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి మెగా ఆటోషో అదరహో - Sakshi

సాక్షి మెగా ఆటోషో అదరహో

కాలంతో పోటీ పడే నగర వాసులకు ప్రతి ఒక్కరూ సొంత వాహనాన్ని సమకూర్చుకోవాలను కోవడం సర్వసాధారణమైపోయింది.

 ఎంవీపీకాలనీ: కాలంతో పోటీ పడే నగర వాసులకు ప్రతి ఒక్కరూ సొంత వాహనాన్ని సమకూర్చుకోవాలను కోవడం సర్వసాధారణమైపోయింది. దీనిని దష్టిలో ఉంచుకుని సాక్షి గత రెండేళ్లుగా మెగా ఆటో షోలు నిర్వహిస్తూ, ఎంతో మందికి వాహన ప్రియులకు తమ మనసుకు నచ్చే వాహనాల్ని సమకూర్చింది. ఇదే స్ఫూర్తితో మూడో సంవత్సరం కూడ సాక్షి మెగా ఆటో షోను  దిగ్విజయంగా నిర్వహించింది. సాగరతీరానికి సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంవీపీకాలనీ వుడా గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే మెగా ఆటో షో ఆదివారం ఘనంగా ముగిసింది. ఆటో షోలో 28 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి, వాహన నగర వాసులకు సొంత వాహనం కళలను సాకారం చేసింది. నగరంలో పేరెన్నిక గల ఎన్నో ప్రముఖ ఆటోమొబైల్స్‌ కంపెనీల సహకారంతో సాక్షి నిర్వహించిన మెగా ఆటో షోకు ఆదివారం ఆశేష జనాధరణ లభించింది. ఆటో షోలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్స్‌ నిర్వాహకులకు తమ తమ ఉత్పాదనల కోసం వచ్చే ఎంక్వయిరీలతో కిటకిటలాడింది.  
–కొలువుదీరిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు:
 శ్రీనివాస యమహా, కంటిపూడి నిషాన్, వరుణ్‌మోటార్స్, మేంగో హుండాయ్, రెనోల్ట్‌ వైజాగ్, లక్ష్మి హుండాయ్, జయభేరి మారుతి నెక్సా, వరుణ్‌బజాజ్, శివశంకర్‌ హీరో, సింగమ్‌ సుజుకీ, ఆరెంజ్‌ షెవ్రెలెట్,నియోన్‌ మోటార్స్, ఆలీవ్‌ టీవీఎస్, ఆటోమోటివ్‌ మాన్యుఫ్యాక్చరర్స్, ఓరా వెస్పా వంటి ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వందలాది సరికొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాహనాలను వినియోగదారులకు అందించే లక్ష్యం. మెగా ఆటో ఎక్స్‌ను వినియోగదారుల చెంతకు తీసుకువచ్చాయి. 
 మెగా బంపర్‌ డ్రా విజేత జి.పావనీ:
సాక్షి మెగా ఆటోషో ముగింపు కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ముందుగా ఆటో షోలో ఏర్పాటు చేసిన వివిధ ఆటోమొబైల్‌ కంపెనీల స్టాల్స్‌ను సందర్శించి,వాహనాల ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అత్యంత ఖరీదైన 650 సీసీ హయోంగ్‌ వాహనంపై ఎమ్మెల్యే సవారీ చేశారు. అనంతరం బంపర్‌ డ్రాలో లక్కి విజేతను ఎంపిక చేశారు. శ్రీనివాస యమహా అందించే యమహా ఫ్యాసినో వాహనాన్ని బంపర్‌ డ్రాలో చినవాల్తేర్‌కు చెందిన జి.పావని కైవసం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement