వివాహాన్ని విధిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి | Registration of marriage compulsory | Sakshi
Sakshi News home page

వివాహాన్ని విధిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

Sep 20 2016 11:41 PM | Updated on Sep 4 2017 2:16 PM

మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

  • కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని తప్పనిసరిగా  రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివాహాల రిజిస్ట్రేషన్‌పై మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నిరోధించేందుకుగాను నిర్బంధ వివాహ చట్టాన్ని  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. వివాహ రిజిస్ట్రేషన్‌తో ఆడ పిల్లలకు రక్షణ, అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ వివాహాన్ని రిజిష్ట్రషన్‌ చేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అక్రమ, బాల్య వివాహాల నిరోధానికి; భర్త ఇంట్లో (భార్య) హక్కులు కోరేందుకు, భర్తను కోల్పోయిన స్త్రీ వారసత్వ హక్కులు కోరేందుకు, భార్యను భర్త  వదిలిపెట్టకుండా ఉండేందుకు, బీమా ప్రయోజనాలు పొందేందుకు వివాహ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుందని వివరించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లోని; వసతి గృహాల్లోని, కళాశాల్లోని పిల్లలకు అవగాహన కల్పించేందుకు విద్య, సంక్షేమ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. వివాహాల రిజిస్ట్రేషన్‌పై స్వయం సహాయక సంఘాలలో, గ్రామ..మండల.. జిల్లా సమాఖ్య సంఘ సమావేశాల్లో చర్చించాలని; బాల్య వివాహల నిరోధానికి, వివాహాల రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావును ఆదేశించారు. ప్రజలకు అవగహన కల్పించేందుకుగాను గ్రామ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, గ్రామస్థాయిలోని ఇతర శాఖల సిబ్బందికి ఓరియంటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించారు. సమావేశంలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష ష్రే‍్టషన్‌ అధికారి మల్లారెడ్డి, సమాచార శాఖ ఏడీ ముర్తుజా, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ రాజేంద్ర, డీఎస్‌డీఓ విష్ణువందన, జెడ్పీ ఏఓ భారతి తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement