తాంసి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ పనుల ఆడిట్‌కు సర్వం సిద్ధం చేశారు. మండలంలో గతేడాది రూ.6 కోట్లతో పనులు చేపట్టారు.
ఉపాధిహామీ ఆడిట్‌కు సర్వ సిద్ధం
Jul 27 2016 11:43 PM | Updated on Sep 4 2017 6:35 AM
తలమడుగు (తాంసి) : తాంసి ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ పనుల ఆడిట్‌కు సర్వం సిద్ధం చేశారు. మండలంలో గతేడాది రూ.6 కోట్లతో పనులు చేపట్టారు. దీనికి సంబంధించి ఆడిట్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భూమయ్య తెలిపారు. మండలంలో 23 గ్రామాల్లో 15 రోజుల పాటు ఆడిట్ బందం పర్యటించి పనులను పరిశీలించనుంది. ఇప్పటికే మండలంలో చేపట్టిన పనులకు సంబంధించిన మస్టర్లు, పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. బుధవారం ఫీల్డ్‌అసిస్టెంట్లు, టీఏలు వివరాలను అందుబాటులో ఉంచారు. గ్రామలలో గ్రామసభలు నిర్వహించి, అనంతరం మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement